🗳️ SIR ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.. ప్రతి ఇంటికీ చేరాలి: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్..
🗳️ SIR ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.. ప్రతి ఇంటికీ చేరాలి: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్..
రామగుండం, జూలై 19 (ఇది మన హక్కు): రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన (SIR) ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి కార్పొరేటర్లు, ఇంచార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆగస్టు 3 వరకు మాత్రమే గడువు ఉన్నందున మిగిలిన ప్రతి రోజును సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటరిని వ్యక్తిగతంగా కలిసి వారి వివరాలు నమోదు చేయించడం కార్పొరేటర్లు, ఇంచార్జీల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.కొన్ని డివిజన్లలో SIR పురోగతి ఇంకా 40 శాతానికే పరిమితమైందని, అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణతో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం సూపర్వైజర్లను నియమించినట్లు వెల్లడిస్తూ, ప్రతి బూత్‌లో BLOలతో సమన్వయం చేసుకుని ఇంటింటికీ వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు."పదవుల కంటే ప్రజాసేవే ముఖ్యం" అనే భావనతో ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లాలని, ఒక్క అర్హ ఓటరు కూడా మిగిలిపోకుండా SIR ప్రక్రియను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే SIR అమలులో ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుని అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు...
కామెంట్‌లు