అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.. ఇందిరా పార్క్ మహాధర్నాలో సీపీఐ
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.. ఇందిరా పార్క్ మహాధర్నాలో సీపీఐ డిమాండ్
హైదరాబాద్ : జూలై 6 (ఇది మన హక్కు): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, జిల్లా సమితి సభ్యుడు శనిగరపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పేదలకు ఇండ్లు ఇస్తామని ప్రకటిస్తూ, మరోవైపు గుడిసెలు వేసుకున్న పేదలను ఖాళీ చేయించడం అన్యాయమని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా గృహహక్కు కోసం పోరాటం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఇల్లు మంజూరు చేయాలని సీపీఐ, వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
కామెంట్‌లు