పోస్ట్‌లు

జూన్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

భాస్కర్‌రావు సేవలు కార్మిక ఉద్యమానికి చిరస్మరణీయం

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ భాస్కర్‌రావు సేవలు కార్మిక ఉద్యమానికి చిరస్మరణీయం గోదావరిఖని, జూన్ 30 (ఇది మన హక్కు): సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ప్రముఖ కార్మిక నాయకుడు మాదిరెడ్డి భాస్కర్‌రావు 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయం వద్ద ఉన్న భాస్కర్‌రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భాస్కర్‌రావు కార్మిక హక్కుల కోసం జీవితాంతం పోరాడారని, కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల హక్కుల సాధన కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కె. స్వామి, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీనివాస్, భాస్కర్‌రావు కుమారుడు శేషు కుమార్, నాయకులు సంకె అశోక్, మాదన మహేష్, గోసిక మోహన్, కన్నం లక్ష్మీనారాయణ, కనకరాజు, సూర్య తదితరులు, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గం : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రైతు భరోసా నిధులను విడుదల చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతు భరోసా పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గి, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుందన్నారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. వ్యవసాయం లాభదాయకంగా మారేందుకు ప్రభుత్వం అన్ని విధాలా రైతులకు అండగా ఉంటుందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెంద...

పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ కోసం సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ కోసం సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం రామగుండం, జూన్ 29 (ఇది మన హక్కు): కోల్ ఇండియాతో సమానంగా పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) – SCCL బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీ-1 ఏరియా అధికారులు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. జూన్ 29 నుంచి జూలై 13 వరకు జీఎం కార్యాలయం ఎదుట ఈ దీక్షలు కొనసాగనున్నాయి. తొలి విడతలో ఆర్జీ-1 ఇన్‌చార్జి అధ్యక్షుడు డా. విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి కోల మల్లేశంతో పాటు అధికారులు దీక్షలో పాల్గొన్నారు. 2022-23 నుంచి 2024-25 వరకు పీఆర్పీ బకాయిల విడుదల, కోల్ ఇండియా తరహాలో పే అప్‌గ్రేడేషన్, సమాన అలవెన్సులు, IIT/IIM ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కోల మల్లేశం హెచ్చరించారు. కార్యక్రమంలో SCCL బ్రాంచ్ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివ...

సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన, ఎనుమ రేషన్ పారంలు పంపిణీ చేసిన- గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన, ఎనుమ రేషన్ పారంలు పంపిణీ చేసిన- గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి  పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లోని లింగాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి ఎనుమరేషన్ ఫారంలో పంచడం, రైతులు సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర స్వామి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరు వారికి ఇచ్చిన ఏనుమరేషన్ ఫారం ను బిఎల్ఓ, బిఎల్ఎ సహాయంతో తప్పులు లేకుండా నింపి సంబంధిత బి ఎల్ ఓ కు ఇవ్వవలెను అని, రైతులు సాదా బైనామా దరఖాస్తు చేసుకున్న రైతు భూమి చుట్టుపక్కల రైతుల వాంగ్మూలంఇప్పించవలసినదిగా అంతర్గాం మండల రెవెన్యూ గ్రామ పరిపాలన అధికారి, గ్రామ పరిపాలన సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పరిపాలన అధికారి, గ్రామ పరిపాలన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి,బి ఎల్ ఓ లు రైతులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం సహకరించాలి – కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం సహకరించాలి – కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ రామగుండం, జూన్ 28 (ఇది మన హక్కు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 22వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ ఎలకలపల్లి గేట్, గౌతమి నగర్ సొసైటీ, చైతన్యపురి కాలనీలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సందర్శించి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆరోగ్య సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం ఆసుపత్రి వైద్య సిబ్బంది, గౌతమి నగర్ సొసైటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార...

ప్రత్యేక ఓటర్ సవరణపై గడపగడపకు తిరుగుతూ అవగాహన కల్పించిన- అంతర్గాం తహశీల్దార్, ఆకెనపల్లి సర్పంచ్, అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ సర్ ఇన్చార్జి గాదె స్రవంతి- సుధాకర్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️  ప్రత్యేక ఓటర్ సవరణపై గడపగడపకు తిరుగుతూ అవగాహన కల్పించిన- అంతర్గాం తహశీల్దార్, ఆకెనపల్లి సర్పంచ్, అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ సర్ ఇన్చార్జి గాదె స్రవంతి- సుధాకర్  పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రాజేశానుసారం అంతర్గా మండల ఓటర్ ప్రత్యేక సవరణ ఇంచార్జ్ సుధాకర్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి పడాల వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గా మండల ప్రత్యేక ఓటర్ సవరణ ఇన్చార్జి అకెనపల్లి సర్పంచ్ గాదే స్రవంతి - సుధాకర్, మండల రెవెన్యూ అధికారి పడాల వరప్రసాద్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి ఓటరును ఇంటింటికీ కలిసి, వారి వివరాలను ఎన్యూమరేషన్ ఫారమ్‌లలో నమోదు చేసి, ఫారమ్ ఒక కాపీని వారికి అందజేయడం జరిగింది.అంతర్గాం ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, బి ఎల్ ఓలు,బిఎల్ఎ లు మీ ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన వివరాలు అందించి,మీ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాము.ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ...

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి – కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి – కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ రామగుండం, జూన్ 28 (ఇది మన హక్కు): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్‌లోని లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మానికేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకూడదని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానికేశ్వర్ రెడ్డి, సీఓ పారిజాతం, ఏఎన్‌ఎం అనూష, బండి సాయి, యాదన్న, పెద్ద మల్లేశం, మహిళలు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

మేడిపల్లి రైతుల పంట పొలాలకు నీళ్లు అందియాలని సింగరేణి SO2 జిఎం కు వినతిపత్రం అందజేసిన ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ మేడిపల్లి రైతుల పంట పొలాలకు నీళ్లు అందియాలని సింగరేణి SO2 జిఎం కు వినతిపత్రం అందజేసిన ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్ మేడిపల్లి గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి తెలపడంతో వారి చూచన మేరకు శనివారం రోజున రామగుండం సింగరేణి SO2 GM చంద్రశేఖర్ గారికి వినతి పత్రం అందజేసినట్లు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ మేడిపల్లి గ్రామం ప్రభావిత సింగరేణి అని గతంలో రైతులు పంటలు వేసుకోవడానికి సింగరేణి వారి ఆధ్వర్యంలో వేసిన నీళ్ల పైపులు తుప్పు పట్టి పైపులు విరిగిపోవడంతో పొలాలకు నీటి సరఫరా ఆగిపోయిందని పంట పొలాలకు నీళ్లు అందకపోవడంతో మేడిపల్లి రైతులు రెండు పంటలు నష్టపోయారని ఇప్పటికైన సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు ఎస్,ఓటు జియం గార్లు స్పందించి వెంటనే మేడిపల్లి గ్రామ రైతులకు సాగునీరు అందించాలని పొలాలు పండించే విధంగా సహకరించాలని ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందని నేను ఇచ్చిన లెటర్ కు ...

ఛత్రపతి సాహు మహారాజ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం పోరాడాలి: బీఎస్పీ నాయకులు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ఛత్రపతి సాహు మహారాజ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం పోరాడాలి: బీఎస్పీ నాయకులు మారపెల్లి రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా 152వ జయంతి వేడుకలు గోదావరిఖని: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రామగుండం నియోజకవర్గ సీనియర్ నాయకుడు మారపెల్లి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పూర్తి భవనంలో ఛత్రపతి సాహు మహారాజ్ 152వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పేగ నరేష్, కాసిపేట స్వామి ముఖ్య అతిథులుగా హాజరై సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా వికాసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని కొనియాడారు. రిజర్వేషన్ల అమలుకు పునాది వేసిన మహోన్నత సంఘ సంస్కర్తగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే దూరదృష్టితో అనేక సంస్కరణలు చేపట్టిన మహనీయుడని గుర్తు చేశారు. ప్రతి మనిషి సమాన గౌరవంతో జీవించాలనే ఆయన ...

రైతు భరోసా కు రైతులు నూతన దరఖాస్తులు తప్పనిసరి చేసుకోవాలి- మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ రైతు భరోసా కు రైతులు నూతన దరఖాస్తులు తప్పనిసరి చేసుకోవాలి- మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్  పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మండల కేంద్రంలోని గ్రామ రైతులు రైతు భరోసా కు నూతన దరఖాస్తులు గడువు తేదీలోపుచేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అంతర్గం రైతు సోదరులు తేదీ 15/6/2026 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు గతంలో పట్టాదారు పాసుపుస్తకం పొంది రైతుభరోసా కు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారు. గతం లో బ్యాంక్ ఖాతా సమస్య వలన డబ్బులు జమకాని రైతులు,రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకోవడానికిరైతులు  పట్టాదార్ పాస్ పుస్తకం, జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, రైతు భరోసా దరఖాస్తు ఫారంతో మీ దగ్గరలోని రైతు వేదికల్లో ఏఈఓ దగ్గర తేదీ 4/7/2026 లోపు దరఖాస్తుచేసుకోవాలని రైతులకు మండలవ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి – నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి – నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పనితీరు గ్రేడింగ్ సూచికలు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్, సమర్థవంతమైన తరగతి గది బోధనపై ప్రత్యేక దృష్టి సారించి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం పెద్దపల్లిలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులు స్వతంత్రంగా చదవడం, మాట్లాడడం, నేర్చుకున్న అంశాలను సృజనాత్మకంగా వ్యక్తీకరించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో వార్షిక విద్యా ప్రణాళిక, ...

జై భారత్ ఎస్సీ పోరాటవేదిక రాష్ట్ర,ఉపాధ్యక్షులుగా బొంకూరి మధు ఎన్నికజై

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️  జై భారత్ ఎస్సీ పోరాటవేదిక రాష్ట్ర,ఉపాధ్యక్షులుగా బొంకూరి మధు ఎన్నిక జై భారత్ సామాజిక విప్లవ రణభేరి తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకుల కార్యకర్తల సదస్సు జరిగింది, హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఖదిజ్ఞాసి ఆశ్రమంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, కుల నిర్మూలన, సాధికారత సామాజిక న్యాయం కోసం అహర్నిశలు సంస్థ పనిచేస్తుంది, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణ మూర్తి, జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షులు జీవన్ జోయల్, నాయకులకు కార్యకర్తలకు కార్యక్రమాల నిర్వహణ విషయంలో దిశ నిర్దేశం చేశారు అనంతరం,జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో జై భారత్ ఎస్సి పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర నూతన jనాయకత్వాన్ని ఎన్నుకున్నారు, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొంకూరి మధు తో పాటు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తన ఎన్నికకు కృషిచేసిన సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షులు జీవన్ జోయల్ కు, బొంకూరి మధు కృతజ్ఞతలు తెలిపారు,అధ్యక్షులుగా మధు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ గళ్ళ ఉపా...

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి రామగుండం, జూన్ 26 (ఇది మన హక్కు): భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR ప్రత్యేక మ్యాపింగ్) కార్యక్రమాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్‌లో కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, TPCC నాయకత్వం సూచనల మేరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూత్ నంబర్–87 పరిధిలో 65 మంది ఓటర్ల ప్రత్యేక మ్యాపింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు వనజ, రాజలక్ష్మి, భాగ్యలక్ష్మి, అంజలి, దివ్య, తాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటరుగా నమోదు కావడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ...

సింగరేణి కార్మికుల 31 డిమాండ్లపై సుదీర్ఘ చర్చలు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ సింగరేణి కార్మికుల 31 డిమాండ్లపై సుదీర్ఘ చర్చలు హైదరాబాద్, జూన్ 25 (ఇది మన హక్కు): సింగరేణి కార్మికుల 31 డిమాండ్ల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై గురువారం హైదరాబాద్‌లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డా. శాశ్వతి రథ్ సమక్షంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. కార్మికుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాలపై ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. చర్చల అనంతరం డా. శాశ్వతి రథ్ జూలై 10లోపు ప్రధాన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం, గుర్తింపు సంఘం పరస్పర చర్చల ద్వారా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే మళ్లీ చర్చలు నిర్వహిస్తామని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మె అనివార్యమని ఎఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. చర్చల్లో ఎఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కే. సా...

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి: ఏఐటీయూసీ గోదావరిఖని, జూన్ 25 (ఇది మన హక్కు): సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఖాకీ యూనిఫామ్‌తో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో ఎస్‌వో టు జీఎం కే. చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న బ్లూ యూనిఫామ్ స్థానంలో ఖాకీ యూనిఫామ్, లాఠీలు, టార్చ్‌లైట్లు, రెయిన్‌కోట్లు, టోపీలు, టవల్స్, డస్ట్ అలవెన్స్, నైట్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్ కల్పించాలని కోరారు. సెక్యూరిటీ గార్డులు శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇన్సూరెన్స్, పూర్తి మాస్టర్లు, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వాహన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

ఎక్లాస్‌పూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ ఎక్లాస్‌పూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం పెద్దపల్లి జిల్లా, జూన్ 25 (ఇది మన హక్కు): రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అంతర్గాం మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులు గుమ్మడి వెంకన్న, విజయలక్ష్మి దంపతులు తమ నూతన గృహంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జూపాక మమత-శ్రీనివాస్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి నూతన వస్త్రాలు అందజేసి సత్కరించారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం అనేక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని సర్పంచ్ పేర్కొన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లగిశెట్టి రాకేష్, బరుపాటి తిరుపతి, ముఖ్య నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది మన హక్క...

యువతకు, వారి తల్లిదండ్రులకుమాదకద్రవ్యాల నిషేధం పై అవగాహన సదస్సు నిర్వహించిన- అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ యువతకు, వారి తల్లిదండ్రులకుమాదకద్రవ్యాల నిషేధం పై అవగాహన సదస్సు నిర్వహించిన- అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి ముర్ ముర్ గ్రామంలో స్థానిక యువతకు, వారి తల్లిదండ్రులకు (అంటి డ్రగ్స్) మాదకద్రవ్యాల నిషేధం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకట స్వామి మాట్లాడుతూ ముఖ్యంగా యువత గంజాయి మత్తు కు అలవాటు పడి తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.గంజాయి మత్తుకు అలవాటు పడిన యువకులు చెడు స్నేహాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని తన విలువైన భవిష్యత్తును అంధకారంచేసుకుంటున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడిన యువకులు అమ్మాయిలను ఏడిపించడం, డబ్బు కోసం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోవడం, దొంగతనాలకు పాల్పడడం, అసాంఘిక కార్యకలాపాలు చేయడం వంటివి చేస్తున్నారు.రోడ్డుపై యువత మత్తులో వాహనాన్ని వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎవరైనా గంజ...

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం,స్కూల్ యూనిఫాములను పంపిణీ చేసిన- గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం,స్కూల్ యూనిఫాములను పంపిణీ చేసిన- గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్  ప్రీ స్కూల్ పిల్లలకు స్కూలు యూనిఫామ్స్ పంపిణీ చేసిన- రాజన్న సేవాసమితి చైర్మన్ మనాలి టాగూర్  పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామం మోడల్ అంగన్వాడి కేంద్రంలో1లో సిడిపిఓ అలేఖ్య పటేల్ఆదేశానుసారం ప్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యం, స్కూలు యూనిఫామ్స్ గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్ అధ్యక్షతన అంగన్వాడి కేంద్రంలో 15 మంది ప్రీస్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం స్కూల్ యూనిఫామ్స్ ఒక్కొక్కరికి రెండు జతలు చొప్పున రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్ యూనిఫామ్స్ ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్ నూతనంగా అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సునీత, పదవి విరమణ, నూతనంగా బాధ్యతలు పొందిన సందర్భంగా వారిని రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్, సర్పంచులు మగ్గిడి స్వరూప- శ్రీనివాస్, ఆంగోత్ రవికుమార్ నాయక్, కొలిపాక చంద్...

ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.. పరిశుభ్రత, క్రమశిక్షణపై ప్రత్యేక ఆదేశాలు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.. పరిశుభ్రత, క్రమశిక్షణపై ప్రత్యేక ఆదేశాలు రామగుండం, జూన్ 23 (ఇది మన హక్కు): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించి హెడ్‌క్వార్టర్స్, ఆర్‌ఐ కార్యాలయం, డాగ్ స్క్వాడ్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధుల నిర్వహణ, స్పెషల్ పార్టీ బాధ్యతలు, రోజువారీ కార్యకలాపాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెడ్‌క్వార్టర్స్ పరిసరాలను పరిశీలించి, కార్యాలయాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం.. జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు: అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం.. జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు: అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ రామగుండం, జూన్ 24 (ఇది మన హక్కు): నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశించారు. మంగళవారం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పని పూర్తైన వెంటనే సైట్‌ను పూర్తిగా శుభ్రపరిచి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలని, సరైన కారణం లేకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఏఈలు తేజస్విని, మనోజ్, అన్వేష్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️ ...

వీరనారి ఝల్కారీ బాయి చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి: డా. మార్షల్ దుర్గం నగేష్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ వీరనారి ఝల్కారీ బాయి చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి: డా. మార్షల్ దుర్గం నగేష్ ఎన్‌టీపీసీ, జూన్ 23 (ఇది మన హక్కు): 1857 తొలి స్వాతంత్ర్య సమరంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన దళిత వీరనారి ఝల్కారీ బాయి కోరీ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలని సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ కోరారు. ఝల్కారీ బాయి 168వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో దళితులు, బహుజనులు, ఆదివాసీలు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని మభ్యపెట్టేందుకు రాణి లక్ష్మీబాయి వేషంలో యుద్ధరంగంలోకి దిగి అపూర్వ సాహసం చేసిన ఝల్కారీ బాయి సేవలను చరిత్రలో మరుగున పడేశారని అన్నారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు జయంతి, వర్థంతులను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి వీరుడు, వీరనారికి సమాన గౌరవం లభించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన...

క్వార్టర్ల తొలగింపుపై ఏఐటియుసి ఆగ్రహం.. కార్మికుల జోలికి వస్తే ఉద్యమం తప్పదన్న మడ్డి ఎల్లా గౌడ్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ క్వార్టర్ల తొలగింపుపై ఏఐటియుసి ఆగ్రహం.. కార్మికుల జోలికి వస్తే ఉద్యమం తప్పదన్న మడ్డి ఎల్లా గౌడ్ గోదావరిఖని, జూన్ 23 (ఇది మన హక్కు): అభివృద్ధి పేరుతో సింగరేణి కార్మికుల క్వార్టర్లు, వాటికి ఆనుకొని ఉన్న షెడ్లను తొలగించే ప్రయత్నాలను సహించబోమని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ హెచ్చరించారు. గోదావరిఖనిలోని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వంకబెండు నుంచి చౌరస్తా వరకు ఉన్న క్వార్టర్ల వద్ద కార్మికులు సొంత ఖర్చుతో నిర్మించుకున్న షెడ్ల తొలగింపుపై యాజమాన్యం జారీ చేసిన నోటీసులను తీవ్రంగా ఖండించారు. స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. గతంలో అభివృద్ధి కోసం క్వార్టర్ల తొలగింపునకు సహకరించామని, ఇకపై కార్మికుల హక్కులకు భంగం కలిగించే చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. తొలగింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో బాధిత కార్మిక కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటియుసి బ్రాంచి కార్...