ప్రత్యేక ఓటర్ సవరణపై గడపగడపకు తిరుగుతూ అవగాహన కల్పించిన- అంతర్గాం తహశీల్దార్, ఆకెనపల్లి సర్పంచ్, అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ సర్ ఇన్చార్జి గాదె స్రవంతి- సుధాకర్
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
ప్రత్యేక ఓటర్ సవరణపై గడపగడపకు తిరుగుతూ అవగాహన కల్పించిన- అంతర్గాం తహశీల్దార్, ఆకెనపల్లి సర్పంచ్, అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ సర్ ఇన్చార్జి గాదె స్రవంతి- సుధాకర్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రాజేశానుసారం అంతర్గా మండల ఓటర్ ప్రత్యేక సవరణ ఇంచార్జ్ సుధాకర్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి పడాల వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గా మండల ప్రత్యేక ఓటర్ సవరణ ఇన్చార్జి అకెనపల్లి సర్పంచ్ గాదే స్రవంతి - సుధాకర్, మండల రెవెన్యూ అధికారి పడాల వరప్రసాద్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి ఓటరును ఇంటింటికీ కలిసి, వారి వివరాలను ఎన్యూమరేషన్ ఫారమ్‌లలో నమోదు చేసి, ఫారమ్ ఒక కాపీని వారికి అందజేయడం జరిగింది.అంతర్గాం ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, బి ఎల్ ఓలు,బిఎల్ఎ లు మీ ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన వివరాలు అందించి,మీ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాము.ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, సవరణ చేసుకోవాలని, మీ ఇంటికి వచ్చినటువంటి బూతు లెవల్ అధికారులకు సహకరించాలని ప్రత్యేక ఓటర్ సవరణ కాంగ్రెస్ పార్టీ అంతర్గాం మండల ఇన్చార్జి, ఆకెనపల్లి సర్పంచ్ గాదె స్రవంతి -సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం రెవెన్యూ మండల అధికారి పడాల వరప్రసాద్, ఇంచార్జ్, అకెనపల్లి సర్పంచ్ గాదె స్రవంతి- సుధాకర్, టి టి ఎస్ అంతర్గాం గ్రామ సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్, ముర్ మూర్ గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్, దార వేణి సాయికుమార్,ఆరు ముళ్ళ మాధవి- మల్లేష్,మాజీ ఎం పిపి ఉరిమెట్ల రాజలింగం, పెద్దపల్లి జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి పుదారి సత్తయ్య గౌడ్, ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు లగిశెట్టి రాకేష్, ఉప సర్పంచ్ యాదాండ్ల సుమన్, వార్డు సభ్యులు కొదురుపాక మహేందర్,బి ఎల్ ఎ చింతల ప్రసన్న, వార్డు సభ్యులు బాణాల శ్రీకాంత్, సీనియర్ పార్టీ నాయకులు బాణాల రాములు,సాధనల మోహన్ రావు, నూతి ప్రవీణ్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు