పోస్ట్‌లు

జులై, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

సూపర్ ఎల్‌నినోపై ముందస్తు కార్యాచరణ తప్పనిసరి: సీఎస్ సంజయ్ జాజు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ సూపర్ ఎల్‌నినోపై ముందస్తు కార్యాచరణ తప్పనిసరి: సీఎస్ సంజయ్ జాజు  రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సహాయాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లా వారీగా సూపర్ ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, ఇన్‌చార్జి మంత్రుల సమీక్ష సమావేశాలకు శాఖల వారీ సమగ్ర నివేదికలతో హాజరుకావాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి ప్ర...

ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం.. దళిత సంక్షేమ పథకాలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మద్దెల దినేష్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం.. దళిత సంక్షేమ పథకాలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మద్దెల దినేష్ పెద్దపల్లి, జూలై 18 (ఇది మన హక్కు): పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ పలు దళిత సంక్షేమ అంశాలను కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లారు. 2018-19, 2020-21 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరైనా సుమారు 1,600 మంది లబ్ధిదారులకు రుణాలు అందలేదని, దళిత బంధు కింద పెండింగ్‌లో ఉన్న 16 యూనిట్లను మంజూరు చేయలేదని, అంబేద్కర్ అభయహస్తం పథకం అమలు లేదని, కులాంతర వివాహ ప్రోత్సాహకాలు అర్హులకు అందడం లేదని ఆయన ఆరోపించారు. అదనపు కలెక్టర్ అరుణ శ్రీ దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ ఆమెను బదిలీ చేయాలని కమిషన్‌ను కోరారు. వినతిపై కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పందిస్తూ, ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మద్దెల దినేష్ తెలిపారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

రూ.150 కోట్ల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం.. వెంటనే స్థల సేకరణ చేపట్టాలి: మద్దెల దినేష్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ రూ.150 కోట్ల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం.. వెంటనే స్థల సేకరణ చేపట్టాలి: మద్దెల దినేష్ గోదావరిఖని, జూలై 17 (ఇది మన హక్కు): రామగుండంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటికీ స్థల సేకరణ, నిర్మాణం ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకుడు మద్దెల దినేష్ అన్నారు. ప్రధాన చౌరస్తాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2028 జనవరి 31లోపు డీపీఆర్ సిద్ధం చేసి నిర్మాణం ప్రారంభించకపోతే రూ.150 కోట్ల నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లక్షలాది కార్మికులు నాణ్యమైన వైద్య సేవలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థల సేకరణ పూర్తి చేసి ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అయిత శివకుమార్, గోలివాడ చంద్రకళ, తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొ...

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూతో డిమాండ్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️ పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూతో డిమాండ్ రామగుండం, జూలై 14 (ఇది మన హక్కు): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW) జిల్లా ఉపాధ్యక్షురాలు శనిగరపు తిరుమల, జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల రమాదేవి డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం AISF ఇచ్చిన "చలో సెక్రటేరియట్" పిలుపు నేపథ్యంలో నాయకులు రేణికుంట్ల ప్రీతం, సాగర్, సురేష్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ, అరెస్టు చేసిన నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, మహిళా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకులు హెచ్చరించార...

చిన్నారుల ఆరోగ్యమే బంగారు భవిష్యత్తుకు పునాది.. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ చిన్నారుల ఆరోగ్యమే బంగారు భవిష్యత్తుకు పునాది.. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి రామగుండం, జూలై 13 (ఇది మన హక్కు): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ చంద్రబాబు కాలనీ గౌట్ స్కూల్‌లో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్నేహలత, స్టాఫ్ నర్స్ సోనీ, ఏఎన్‌ఎం పద్మ, ఆయా సావిత్రి, పాఠశాల చైర్‌పర్సన్ అంజలి, హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, స్వప్న, రవళి తదితరులు పాల్గొన్నారు. కార...

ప్రజా సేవలో 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము.. ఎస్‌ఐఆర్ సమీక్షతో పాటు అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️ ప్రజాసేవలో 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము.. ఎస్‌ఐఆర్ సమీక్షతో పాటు అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ రామగుండం, జూలై 10 (ఇది మన హక్కు): రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము డివిజన్‌లో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమ పురోగతిపై బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కార్పొరేటర్, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి, వారికి వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసి నాణ్యతను నిర్ధారించారు. చిన్నారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం నిరంతరం అందేలా అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకురాలు, వార్డ్ ఆఫీసర్ సాయి, పసరగొండ రాంకీ, వెంకటేష్, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు త...

నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి – మేయర్ మహంకాళి స్వామి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి – మేయర్ మహంకాళి స్వామి రామగుండం, జూలై 10 (ఇది మన హక్కు): ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సూపర్‌వైజర్లు, సంబంధిత సిబ్బంది మరింత కృషి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణశ్రీతో కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఎస్‌ఐఆర్ పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీలోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు బీఎల్‌ఓలతో పాటు వార్డు అధికారులు, సహాయకులకు మల్టిపుల్ లాగిన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ నమోదు, ఫారాల నింపడంలో ఓటర్లకు సహకరించడంతో పాటు హెల్ప్‌డెస్క్ ...

ప్రజల భద్రతే లక్ష్యం.. 12వ డివిజన్‌లో చెట్ల పొదల తొలగింపు – కార్పొరేటర్ బాబుమియ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️  ప్రజల భద్రతే లక్ష్యం.. 12వ డివిజన్‌లో చెట్ల పొదల తొలగింపు – కార్పొరేటర్ బాబుమియా రామగుండం, జూలై 10 (ఇది మన హక్కు): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్‌లో కమిషనర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామి ఆదేశాల మేరకు కార్పొరేటర్ బాబుమియా పర్యవేక్షణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా, నివాస గృహాల మధ్యలో పెరిగిన చెట్ల పొదలను తొలగించారు. వర్షాకాలంలో ఈ పొదల కారణంగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాబుమియా మాట్లాడుతూ, డివిజన్ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "శుభ్రత అందరి బాధ్యత.. ప్రతి పౌరుడి ఆరోగ్య భద్రతే మన లక్ష్యం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ రంగు నాగభూషణం, పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్, నాయకులు డిష్ సదానందం, తోట రమేష్, చాంద్ పాషా, సలీం, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమ...

ప్రభుత్వ రుణాలు పెండింగ్‌లో ఉంచొద్దు – అర్హులందరికీ వెంటనే ప్రయోజనాలు అందించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️   ప్రభుత్వ రుణాలు పెండింగ్‌లో ఉంచొద్దు – అర్హులందరికీ వెంటనే ప్రయోజనాలు అందించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, జూలై 9 (ఇది మన హక్కు): ప్రభుత్వ ప్రాయోజిత పథకాల రుణ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, పీఎం స్వనిధి రుణాల పంపిణీని వేగవంతం చేయాలని, తిరస్కరించిన దరఖాస్తులకు లిఖితపూర్వకంగా కారణాలు తెలియజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఖాతాదారుడికి పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై వంటి సామాజిక భద్రత బీమా పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని, గ్రామ స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, నాబార్డ్, ఆర్బీఐ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

ఓటరు సవరణతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి – 21వ డివిజన్‌లో కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ చొరవ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ఓటరు సవరణతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి – 21వ డివిజన్‌లో కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ చొరవ గోదావరిఖని, జూలై 9 (ఇది మన హక్కు): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ వీర్లపల్లిలో బూత్ నెం. 202 వద్ద ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలరావు, పిట్టల రమేష్, సొల్లు కుమార్, కలవేన అశోక్తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు. అనంతరం డివిజన్ అభివృద్ధి పనులపై దృష్టి సారించిన కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో కొత్త నాలా ఔట్‌లెట్ నిర్మాణం, లక్ష్మీపురం రహదారి వెంట తుమ్మపొదలు, చెట్ల తొలగింపు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో వేముల స్వామి, బక్కయ్య, శ్రీనివాస్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి – రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఐక్యవేదిక డిమాండ్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి – రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఐక్యవేదిక డిమాండ్ గోదావరిఖని, జూలై 9 (ఇది మన హక్కు): గోదావరిఖని పట్టణంలో అర్బన్ తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రామగుండాన్ని పూర్తిస్థాయి రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్, డాక్టర్ దుర్గం నగేష్, అయిత శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, 1.78 లక్షల మందికి పైగా ప్రజలు రెవెన్యూ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసి, రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో...

సింగరేణి నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆర్జీ-1 జీఎం ఆఫీస్ ముట్టడి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ హెచ్చరిక

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ సింగరేణి నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆర్జీ-1 జీఎం ఆఫీస్ ముట్టడి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ హెచ్చరిక  సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల రక్షణ, పెండింగ్ వేతనాల సాధన కోసం తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం (రి.నెం: 2430) ఆధ్వర్యంలో నిరవధిక పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రెండు రోజుల నుండి నర్సరీ గేటు ముందు కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతిస్తూ హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు ప్రధాన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.పండుగ రోజుల్లో విధులకు హాజరైన వారికి పీహెచ్‌డీ (PHD) మరియు డబుల్ మాస్టర్ సౌకర్యం కల్పించాలి సంస్థలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలి. కార్మికుల పీఎఫ్...

కాంట్రాక్ట్ కార్మికుడు యేసురత్నం కుటుంబానికి రూ.కోటి పరిహారం – పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి: ఎఐటీయూసీ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ కాంట్రాక్ట్ కార్మికుడు యేసురత్నం కుటుంబానికి రూ.కోటి పరిహారం – పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి: ఎఐటీయూసీ గోదావరిఖని, జూలై 7 (ఇది మన హక్కు): ఓసీపీ-5 మైన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు కోట యేసురత్నం కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని ఎఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, యజమానిపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల భద్రత విషయంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీపీ-5 మైన్ వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, షిఫ్ట్ సమయాల్లో ఎస్‌అండ్‌పీసీ సిబ్బందిని విధుల్లో నియమించడం, భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం అత్యవసరమని పేర్కొన్నారు. యేసురత్నం కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎఐటీయూసీ అండగా ఉంటుందని,...

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.. ఇందిరా పార్క్ మహాధర్నాలో సీపీఐ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️   అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.. ఇందిరా పార్క్ మహాధర్నాలో సీపీఐ డిమాండ్ హైదరాబాద్ : జూలై 6 (ఇది మన హక్కు): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, జిల్లా సమితి సభ్యుడు శనిగరపు చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పేదలకు ఇండ్లు ఇస్తామని ప్రకటిస్తూ, మరోవైపు గుడిసెలు వేసుకున్న పేదలను ఖాళీ చేయించడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా గృహహక్కు కోసం పోరాటం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఇల్లు మంజూరు చేయాలని సీపీఐ, వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఇది మన హక్కు సమాచార ...

స్మశాన వాటిక భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసి గ్రామానికి అప్పగించాలి.. కలెక్టర్‌కు మురుమూరు గ్రామ ప్రజల వినతి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ స్మశాన వాటిక భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసి గ్రామానికి అప్పగించాలి.. కలెక్టర్‌కు మురుమూరు గ్రామ ప్రజల వినతి పెద్దపల్లి : జూలై 6 (ఇది మన హక్కు): మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 126లో స్మశాన వాటిక కోసం కేటాయించిన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని గ్రామానికి అప్పగించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు గ్రామ పాలకవర్గం, ప్రజలు, యువకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్మశాన వాటిక కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇది సాగుభూమి కాదని, గ్రామ ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్మశాన వాటిక భూమి అని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణలను వెంటనే తొలగించి, భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదండ్ల సుమన్, పాలకవర్గ సభ్యులు కొదురుపాక మహేందర్, లంక మధునయ్య, మగ్గిడి రమ్య–రమేష్, వడకపురం స్వప్న–తిరుపతి, మ...

ఓసీపీ-3లో ఓబీ తరలింపులో రూ.20 కోట్ల కుంభకోణం.. విజిలెన్స్ విచారణకు మద్దెల దినేష్ డిమాండ్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ ఓసీపీ-3లో ఓబీ తరలింపులో రూ.20 కోట్ల కుంభకోణం.. విజిలెన్స్ విచారణకు మద్దెల దినేష్ డిమాండ్ రామగుండం ఆర్జీ-2 ఓసీపీ-3లో ఓబీ మట్టి తరలింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌టర్నల్ డంప్‌యార్డ్‌కు తరలించాల్సిన మట్టిని ఇంటర్నల్ డంప్‌లోనే వేసి సింగరేణి సంస్థకు రూ.15 నుంచి 20 కోట్ల వరకు నష్టం కలిగిస్తున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆరోపించారు. V9 కాంట్రాక్ట్ సంస్థ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో డంపింగ్ చేయాల్సి ఉండగా, తవ్విన ప్రాంతానికి సమీపంలోనే మట్టిని డంప్ చేస్తూ ఎక్స్‌టర్నల్ డంపింగ్ చేసినట్లు రికార్డులు సృష్టిస్తోందని, దీనికి కొందరు స్థానిక అధికారులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిలో ఎక్కువ భాగం ఎక్కడ డంప్ చేశారనే వివరాలు లేవని అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, V9 సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, సింగరేణి యాజమాన్యం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.. ఇది మన హక...

రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ ఇంచార్జ్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన 25, 26, 27, 28, 29, 30 డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA)సమీక్ష సమావేశం

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ ఇంచార్జ్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన 25, 26, 27, 28, 29, 30 డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA)సమీక్ష సమావేశం ఈ సమావేశానికి రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు హాజరై, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియపై BLAలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, ప్రతి అర్హులైన ఓటరు జాబితాలో పేరు ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి బూత్ స్థాయిలో పార్టీ నాయకులు, BLAలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు, BLAల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశం అనంతరం BLAలకు రామగుండం నియోజకవర్గ BRS Party Booth Level Agent ID Cards ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి గారు, 26వ డివిజన్ కార్పొరేటర్ బాదావత్ నర్సమ్మ–సారయ్య నాయక్ గారు, మాజీ కార్పొరేటర్ నారాయణదాసు మారుతి గారు మరియు తెలంగాణ ఉద్యమ నాయకులు,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ...

రామగుండం కార్పొరేషన్లో రాక్ పికర్స్ పైలట్ ప్రాజెక్ట్ రద్దుచేసి కార్మికుల ఉపాధిని కాపాడాలి తెలంగాణ కాంట్రక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మద్దతు తెలిపారు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ రామగుండం కార్పొరేషన్లో రాక్ పికర్స్ పైలట్ ప్రాజెక్ట్ రద్దుచేసి కార్మికుల ఉపాధిని కాపాడాలి   తెలంగాణ కాంట్రక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మద్దతు తెలిపారు రామగుండం నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలోనే అభివృద్ధిలో తనదంటూ మార్కు చూపించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు చొరవ తీసుకొని చెత్త సేకరణ చేసే కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాము                            20 సంవత్సరాలుగా పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వీరిని ఆదుకోవాలని పైలెట్ ప్రాజెక్టులో వచ్చిన వెహికల్స్ కి పాతవారిని విధుల్లో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులను కోరుతున్నాం                                                                            ...

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన - సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ సిసి రోడ్డు పనులను ప్రారంభించిన - సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి  పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం గోలివాడ గ్రామంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సహకారంతో సర్పంచ్ సిసి రోడ్డులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొలిపాక చంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎలక్షన్ లో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎన్ ఆర్ జీ ఎస్ నిధులతో ఐదు లక్షల సిసి రోడ్డు ప్రారంభించడం జరిగిందని, రాబోయే కాలంలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తానని ప్రజలకు గ్రామ సర్పంచ్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ బొడ్డు ఉమా రాణి-రమేష్ , వార్డు సభ్యులు ఆవుల విజయపాల్ యాదవ్, మట్ట విష్ణు, మాజీ సర్పంచ్ ధరణి మల్లేష్,ఎనగంటి దామోదర్ రావు,బొడ్డు రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️