సింగరేణి నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆర్జీ-1 జీఎం ఆఫీస్ ముట్టడి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ హెచ్చరిక
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
సింగరేణి నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆర్జీ-1 జీఎం ఆఫీస్ ముట్టడి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ హెచ్చరిక
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల రక్షణ, పెండింగ్ వేతనాల సాధన కోసం తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం (రి.నెం: 2430) ఆధ్వర్యంలో నిరవధిక పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రెండు రోజుల నుండి నర్సరీ గేటు ముందు కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతిస్తూ హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు ప్రధాన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.పండుగ రోజుల్లో విధులకు హాజరైన వారికి పీహెచ్‌డీ (PHD) మరియు డబుల్ మాస్టర్ సౌకర్యం కల్పించాలి సంస్థలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలి. కార్మికుల పీఎఫ్ (PF) డబ్బులను నేరుగా వారి వ్యక్తిగత అకౌంట్లలోనే జమ చేయాలి.గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హై పవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రతను వెంటనే అమలు చేయాలి. నర్సరీ కార్మికులు ఎదుర్కొంటున్న ఉపాధి సమస్యలపై మద్దెల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే క చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కొత్త టెండర్ ఆర్జీ-1 నర్సరీ కార్మికులకు తక్షణమే కొత్త టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి. టెండర్ వచ్చే వరకు కార్మికులందరినీ విధుల్లోకితీ సుకోవాలి.శ్రీరాంపూర్ నర్సరీ కార్మికులకు 1000 మాస్టర్స్ ఇచ్చి ఉపాధి కల్పించినట్లే, ఆర్జీ-1 నర్సరీ కార్మికులకు కూడా అదే రీతిలో ఉపాధి చూపాలి. కొత్త టెండర్ వచ్చే లోపు ఐఈడీ (IED) లేదా సివిల్ విభాగాల్లో మిగిలి ఉన్న మాస్టర్స్‌ను వీరికి కేటాయించి ఉపాధిని కొనసాగించాలి.యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి నర్సరీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే, సింగరేణి వ్యాప్తంగా ఉన్న నర్సరీ కార్మికులందరినీ ఏకం చేసి ఆర్జీ-1 జీఎం (GM) కార్యాలయాన్ని ముట్టడిస్తామని మద్దెల శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కామెంట్‌లు