పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

37వ డివిజన్‌లో బీఎస్పీ బి–ఫామ్ అందజేత… ఆరేపల్లి క్రాంతికిరణ్‌కు ఘన మద్దతు...

చిత్రం
 ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని ( టౌన్ రిపోర్టర్ అరుకల విక్రమ్ ) 37వ డివిజన్‌లో బీఎస్పీ బి–ఫామ్ అందజేత… ఆరేపల్లి క్రాంతికిరణ్‌కు ఘన మద్దతు... రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్‌లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్పొరేటర్ అభ్యర్థిగా ఆరేపల్లి క్రాంతికిరణ్‌కు బి–ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ జింక ఉదయ్ పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ ప్రజల ఆదరణ తమకు బలంగా ఉందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని కార్పొరేటర్ అభ్యర్థి ఆరేపల్లి క్రాంతికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో 37వ డివిజన్‌లో బీఎస్పీ ఘన విజయం సాధిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు... ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్

23వ డివిజన్‌లో భేంద్రం రాజిరెడ్డికి ప్రగతి నగర్ యూత్ సంపూర్ణ మద్దతు....

చిత్రం
 ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని (టౌన్ రిపోర్టర్ అరుకల విక్రమ్) 23వ డివిజన్‌లో భేంద్రం రాజిరెడ్డికి ప్రగతి నగర్ యూత్ సంపూర్ణ మద్దతు.... రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 23వ డివిజన్ ప్రగతి నగర్ యూత్ సభ్యులు భేంద్రం రాజిరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గతం నుంచి డివిజన్ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అభివృద్ధి పనులతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న రాజిరెడ్డి గారిని ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడం తమ బాధ్యతగా తీసుకుంటున్నామని యూత్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్

మానసిక, శరీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతో ముఖ్యం- అంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్...

చిత్రం
 ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని (టౌన్ రిపోర్టర్ అరుకల  విక్రమ్) మానసిక, శరీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతో ముఖ్యం- అంతర్గాం తహసిల్దార్  తూము రవీందర్ పటేల్... పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం మండల కేంద్రంలోని టీ టీ ఎస్ అంతర్గాం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో టీ టీ సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సి.ఎం.కప్ మండల స్థాయి ఆటల పోటీలు కబడ్డీ, కోకో, వాలీబాల్, లాంగ్ జంప్, రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందని,క్రీడలలో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతి ప్రదానోత్సవం అంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్ చేతుల మీదుగా బహుమతులు బహూకరించడం జరిగింది.ఈ కార్యక్రమములో అంతర్గాం, బ్రాహ్మణపల్లి, పోట్యాల గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందినటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలోఅంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్, ఎం.పి.డి.ఓ. తిరుపతి, ఎం.ఇ.ఓ. ఏకాంబరం, పి.ఇ.టి.లు శోభారాణి, తిరుపత...

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...

చిత్రం
  ఇది మన హక్కు సమాచార పత్రిక (టౌన్ రిపోర్టర్ ఆరుకల విక్రమ్) తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు... తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2001 నుండి క్రియాశీలకంగా పనిచేస్తూ, పార్టీకి నిబద్ధతతో సేవలందించిన పొన్నం విజయ్ గౌడ్ (2వ డివిజన్) మరియు పొన్నం సుమలత (34వ డివిజన్) లకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం బి-ఫామ్‌లు కేటాయించడం తెలంగాణ ఉద్యమ సేవలకు వచ్చిన గౌరవంగా భావించాల్సిన విషయం..ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొందిన పొన్నం దంపతులకుమాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్,మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరు కంటి చందర్,కార్మిక నేత కౌశిక హరి, రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక్ తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు..తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు నేడు ఫలించడం సంతోషకరమని, రానున్న రోజుల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్ ...

జనసేన బరిలోకి 37వ డివిజన్… బీఫామ్ సమర్పించిన అభ్యర్థి...

చిత్రం
ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని ( టౌన్ రిపోర్టర్ అరుకల విక్రమ్) జనసేన బరిలోకి 37వ డివిజన్… బీఫాం సమర్పించిన అభ్యర్థి .... రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా 37వ డివిజన్‌కు బి ఫామ్ అధికారికంగా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే లక్ష్యంతో,అభివృద్ధి–పారదర్శక పాలనే అజెండాగా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తోంది..37వ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా, మౌలిక వసతులు, పరిశుభ్రత, త్రాగునీరు, రహదారులు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు–కార్యకర్తల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేశారు... ఇది మన హక్కు సమాచార పత్రిక  మేనేజింగ్ డైరెక్టర్& ఎడిటర్  వడ్లకొండ మహేందర్ గౌడ్..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మారుతి, విఠల్ నగర్‌లో డివిజన్స్ మీటింగ్...

చిత్రం
 ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని ( టౌన్ రిపోర్టర్ అరుకల  విక్రమ్ )  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మారుతి, విఠల్ నగర్‌లో డివిజన్స్ మీటింగ్.... రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్ (60వ డివిజన్) , విఠల్ నగర్‌ (12వ డివిజన) లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.... ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఎన్నికల కోడ్‌ను పాటించాలి, గొడవలు, సోషల్ మీడియా లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సందేశాలు చేయడం, వ్యక్తిగత దుషణలు, అక్రమ, అసత్య ప్రచారం చేయరాదని సూచించారు. ప్రభుత్వం కార్యాలయాలకు, దేవాలయాలకు, మసీద్ లకు ఎలాంటి వాల్ పోస్టర్స్ అంటించడం, వాల్ రైటింగ్ రాయడం చట్టరీత్యా నేరం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.మీ డివిజన్ పరిధిలో ప్రైవేట్ ఇంటి గోడలపై ప్రచారం కి సంబందించిన వాల్ పోస్టర్స్ అంటించడం, వాల్ రైటింగ్ రాయడం చేస్తే ఇ...