మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మారుతి, విఠల్ నగర్‌లో డివిజన్స్ మీటింగ్...

 ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని ( టౌన్ రిపోర్టర్ అరుకల  విక్రమ్ ) 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మారుతి, విఠల్ నగర్‌లో డివిజన్స్ మీటింగ్....

రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్ (60వ డివిజన్) , విఠల్ నగర్‌ (12వ డివిజన) లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.... ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఎన్నికల కోడ్‌ను పాటించాలి, గొడవలు, సోషల్ మీడియా లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సందేశాలు చేయడం, వ్యక్తిగత దుషణలు, అక్రమ, అసత్య ప్రచారం చేయరాదని సూచించారు. ప్రభుత్వం కార్యాలయాలకు, దేవాలయాలకు, మసీద్ లకు ఎలాంటి వాల్ పోస్టర్స్ అంటించడం, వాల్ రైటింగ్ రాయడం చట్టరీత్యా నేరం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.మీ డివిజన్ పరిధిలో ప్రైవేట్ ఇంటి గోడలపై ప్రచారం కి సంబందించిన వాల్ పోస్టర్స్ అంటించడం, వాల్ రైటింగ్ రాయడం చేస్తే ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలి.ప్రచారం 6:00 to రాత్రి 10:00 గంటలకు ముగించాలి. మైక్ ఉపయోగిస్తే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ప్రచారం చేసే సమయంలో ర్యాలీ లకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ర్యాలీ సమయం తెలిపినచో అందరూ అభ్యర్థులకు అవకాశం కల్పించేలా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనియా సంఘటనలకు తావులేకుండా భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల కు 100మీటర్లు దూరం లో ఉండాలి, కేంద్రం వద్ద కండువాలు ధరించి ప్రచారం చేయకూడదు. గుంపులు గుంపులుగా ఉండకూడదు. 
ఓటు వేయడానికి వెళ్లే సమయంలో మొబైల్ ఫోన్ పోలింగ్ కేంద్రం లోకి తీసుకెళ్ల కూడదు. ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు ఎవరిని కించపరిచే విధంగా, అసభ్యకరంగా మాట్లాడకూడదు. ప్రజలు గెలిపించి ఇచ్చిన అవకాశంను ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి గురించి అందరితో కలిసి పనిచేయాలి అన్నారు.ఫిబ్రవరి 16 వ తేదీ వరకు ఎన్నికలు కోడ్ ఉంటుంది కనుక ఎలాంటి విజయోత్సవ ర్యాలీ లు టపాకాయలు కాల్చడం చేయకూడదు. ప్రతి ఒక అభ్యర్థి వారి వారి అనుచరులకు ముందస్తు ఆదేశాలు, హెచ్చరికలు చేస్తూ, వారిని గమనిస్తూ ఉండాలి అని ఎవరైనా అనుచరులు ఎన్నికల నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే, అభ్యర్థుల పై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎలాంటి సమస్యలు ఎదురైన వెంటనే పోలీస్ కు, ఎన్నికల అధికరులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ఎన్నికలు శాంతియుతంగా నిర్భయంగా, నిబద్దత తో నిర్వహించేలా, ప్రజలు అభ్యర్థులు పోలీస్ సహకరించగలరు ఎన్నికల నిర్వహణ కి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ డివిజన్ మీటింగ్‌లో ఎస్ఐ రమేష్, అనూష, స్థానిక కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు, క్రైమ్ సిబ్బంది, బ్లూ క్లోట్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...