రామగుండంలో ఒంటరి మహిళకు క్యాన్సర్ చికిత్సకు నీడ గ్రూప్ ఆర్థిక సహాయం..
ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని.. రామగుండంలో ఒంటరి మహిళకు క్యాన్సర్ చికిత్సకు నీడ గ్రూప్ ఆర్థిక సహాయం.. రామగుండం ప్రాంతానికి చెందిన బత్తుల రాజేశ్వరి అనే ఒంటరి మహిళ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ, హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో “నీడ మన 100 రూపాయలు సమాజం కోసం” గ్రూప్ ఆమెకు అండగా నిలిచింది.గ్రూప్ లీడర్ షహదా ద్వారా విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ గ్రూప్ తరఫున రూ.3,000లను చికిత్స ఖర్చుల కోసం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో ఇలాంటి నిరుపేదలు ఎక్కడ ఉన్నా నీడ సంస్థ తప్పక సహాయం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, ఎండి షహదా తదితరులు పాల్గొన్నారు. .. ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్