""బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం..
(ఇది మన హక్కు సమాచార పత్రిక) గోదావరిఖని ""బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం.. గోదావరిఖని చౌరస్తాలో బాబా తాజుద్దీన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్‌బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పరస్పర సౌహార్దం, మానవతా భావాన్ని ప్రతిబింబించారు. బాబా తాజుద్దీన్ గారి సందేశమైన ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లింది.ట్రస్ట్ నిర్వాహకులు అడ్వకేట్ శానవాజ్ ఖాన్ ఆఫ్జాల్ రాజ్వి మాట్లాడుతూ, బాబా తాజద్దీన్ జ్ఞాపకర్థం సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది.ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు మునవార్,అసిఫ్, అలీం, సయెద్ అహ్మద్, హాజీ, రియాజ్ బైగా, లియకత్, షాబుద్దీన్, సందేశ్, భీమ్ సంగపల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.. ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్ ...