భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర ఏర్పాట్లు: స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్....
((ఇది మన హక్కు సమాచార పత్రిక:-- గోదావరిఖని...))
""భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర ఏర్పాట్లు: స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్....
గోదావరిఖని: సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్ల పనులను శుక్రవారం అర్జీ 1 జియం లలిత్ కుమార్ తో కలసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా పర్యవేక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కైట్ ఎగిరేసి పండుగ సందడి లో పాల్గొన్నారు..నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు...
కామెంట్‌లు