రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..
((పెద్దపల్లి జిల్లా రామగుండం))
రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం…
రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..
రామగుండం రైల్వే స్టేషన్‌లో ధనపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణీ మహిళకు అకస్మాత్తుగా ప్రసవ వేదనలు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ దవ రజిత రమ పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించారు.ఆమె ధైర్యసాహసాలతో రామగుండం రైల్వే స్టేషన్‌లోనే అత్యవసర చికిత్స అందించి, అక్కడికక్కడే సురక్షితంగా డెలివరీ నిర్వహించి తల్లి, శిశువు ఇద్దరి ప్రాణాలను కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి రెండు నిండు ప్రాణాలను రక్షించిన నర్సింగ్ ఆఫీసర్ "దవ రజిత, రమ,ను ప్రయాణికులు, స్థానికులు అభినందించారు.. """మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన ప్రజల హృదయాలను హత్తుకుంది...
కామెంట్‌లు