6, జనవరి 2026, మంగళవారం

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;;    రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్‌లో రెండు రోజులుగా డ్రైనేజీ జామ్ కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే పిల్లలు దుర్వాసన, నీటి నిల్వల కారణంగా తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది...ఈ సమస్యపై కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు తక్షణమే స్పందించి మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపి డ్రైనేజీ శుభ్రత పనులు చేపట్టారు...సమస్యను వెంటనే పరిష్కరించడంలో కృషి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అబ్బాస్ యాదవ్ అభినందించారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు...

1 కామెంట్‌: