ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు! మీ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందా..?

రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు! మీ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందా? SIRలో భారీగా ఓటర్ల పేర్లు గల్లంతు.. ఫారం 6, 7, 8తో అభ్యంతరాలకు అవకాశం | 5,500 నో మ్యాపింగ్, 49,034 అనామలీస్ ఓటర్లకు నోటీసులు రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు! రామగుండం, ఆగస్టు 25 (ఇది మన హక్కు): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఈ నెల 27వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ తెలిపారు. 🔹 ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను చదవడం 🔹 ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించడం 🔹 ఫారం 6, 7, 8 స్వీకరించడం 🔹 అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తప్పిపోకుండా చూడడం కోసం ఈ వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,13,990 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 1,83,233 మంది ఓటర్ల పేర్లు మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నో మ్యాపింగ్ క...

రామగుండం నగరపాలక సంస్థలో 17 మంది సిబ్బందికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు..

రామగుండం నగరపాలక సంస్థలో 17 మంది సిబ్బందికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందజేత రామగుండం, ఆగస్టు 15 (ఇది మన హక్కు): ఉత్తమ సేవలు అందించినందుకు రామగుండం నగరపాలక సంస్థకు చెందిన 17 మంది సిబ్బందికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని గుర్తించి ఈ ప్రశంసా పత్రాలను అందజేశారు. తేజస్విని (ఏఈ), శ్రావణ్ కుమార్ (టీపీబీఓ), శ్రీపాల్ (యూడీఆర్‌ఐ), సౌమ్య, నరేష్ (జూనియర్ అసిస్టెంట్లు), శ్రీనివాస్ (జూనియర్ అకౌంటెంట్), విజయ్ కుమార్ (వార్డు ఆఫీసర్), కుమారస్వామి (పీఆర్‌ఓ), కిరణ్ కుమార్, యుగాంత్ (కంప్యూటర్ ఆపరేటర్లు), తిరుపతి (శానిటరీ జవాన్), తాజుద్దీన్ (పంప్ ఆపరేటర్), ప్రశాంత్ (వార్డు అసిస్టెంట్), సాగర్ (ఎలక్ట్రీషియన్), అశోక్ (ఆఫీస్ సబార్డినేట్), రమేష్ (ట్రాలీ డ్రైవర్), తిరుపతి (డ్రెయిన్ క్లీనర్)లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ...

రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: రాష్ట్ర మంత్రులకు మేయర్ మహంకాళి స్వామి వినతి

రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: రాష్ట్ర మంత్రులకు మేయర్ మహంకాళి స్వామి వినతి వరద నియంత్రణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఎల్‌ఆర్‌ఎస్, విద్యుత్ సమస్యలపై మంత్రులకు వినతిపత్రం రామగుండం, ఆగస్టు 8 (ఇది మన హక్కు): రామగుండం నగర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు నగరంలోని పలు సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రులను నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రుల స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌తో పాటు నగర మేయర్ మహంకాళి స్వామి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ నేతృత్వంలో రామగుండం నగరానికి సంబంధించిన పలు సమస్యలపై మంత్రులకు వినతిపత్రం సమర్పించినట్లు మేయర్ తెలిపారు. రామగుండం వరదల నివారణకు కరకట్ట నిర్మించాలి గో...

ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు?.. వరద బాధితులకు న్యాయం ఎక్కడ? మారేడుపల్లి వాసుల ఆవేదన

ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు?.. వరద బాధితులకు న్యాయం ఎక్కడ? మారేడుపల్లి వాసుల ఆవేదన వరదల్లో నష్టపోయిన నిరుపేదలకు ఇళ్ల మంజూరులో అన్యాయం జరుగుతోందని గ్రామస్థుల ఆగ్రహం.. అర్హులైన బాధితులను గుర్తించి వెంటనే న్యాయం చేయాలని విజ్ఞప్తి జగిత్యాల, ఆగస్టు 7 (ఇది మన హక్కు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో వరదల కారణంగా తీవ్ర నష్టపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అందడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇల్లు కోల్పోయిన, గోడలు కూలిపోయిన, నివాసానికి అనువుగా లేని ఇళ్లలో జీవిస్తున్న నిరుపేదలకు కాకుండా ఇప్పటికే ఇల్లు ఉన్న కొందరికి పథకం ప్రయోజనం లభిస్తోందని ఆరోపిస్తున్నారు.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో మారేడుపల్లి గ్రామంలోని పలువురు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, మరికొన్ని నివాసయోగ్యం కాకుండా మారాయని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ అర్హులైన వరద బాధితుల పేర్లు జాబితాలో లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికే పక్కా ఇళ్లు ఉన్న కొందరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరుగుతుండగా, నిజంగా అవసరమైన పేద కుటుంబాల...

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి : అదనపు కలెక్టర్  బి.శ్రీరాములు జిల్లా అధికారులతో సమీక్ష.. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాల.. రామగుండం, ఆగస్టు 6 (ఇది మన హక్కు): జిల్లాలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు . గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా వేడుకలకు హాజరు కావాలని సూచించారు. ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం, డయాస్, సీటింగ్ ఏర్పాట్లు, భద్రత, వైద్య శిబిరాలు, అంబులెన్స్, తాగునీటి సదుపాయాలు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రాల పంపిణీతో పాటు ముఖ్య అతిథి సందేశానికి అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని స...

జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక చేయూత వి.ఎస్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.1,000 అందజేత

  ఇది మన హక్కు పెద్దపెల్లి జిల్లా బ్యూరో రిపోర్టర్✍️ జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక చేయూత  వి.ఎస్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.1,000 అందజేత వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సీహెచ్ కిషోర్ సాయం.. తొలి విడతగా రూ.3,000 అందజేత రామగుండం, ఆగస్టు 6 : { ఇది మన హక్కు} :  ఆర్థిక ఇబ్బందులతో జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యను కొనసాగిస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీకి చెందిన విద్యార్థిని సిరివేన అక్షయకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ (VSSS) ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు..గోదావరిఖని మేదర్‌బస్తిలోని చంద్రశేఖర్ కిరాణా మర్చంట్ నిర్వాహకులు సీహెచ్ కిషోర్, తన తండ్రి సీహెచ్ చంద్రశేఖర్ జ్ఞాపకార్థం విద్యార్థిని జీఎన్‌ఎమ్ మూడేళ్ల కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి నెల రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మూడు నెలలకు సంబంధించిన రూ.3,000ను విద్యార్థినికి అందజేశారు.. ఈ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ డా. సురభి శ్రీధర్ మాట్లాడుతూ, సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్ర...

తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగు: నగర మేయర్ మహంకాళి స్వామి

తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగు: నగర మేయర్ మహంకాళి స్వామి తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపు గోదావరిఖని, ఆగస్టు 6 (ఇది మన హక్కు): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ స్వాగత్ ఫంక్షన్ హాల్‌లో సీడీపీఓ అలేఖ్య ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, పుట్టిన శిశువుకు తల్లి పాలు అమృతంతో సమానమని, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లి పాల ప్రాధాన్యంపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు మాట్లాడుతూ, తల్లి పాల వారోత్సవాల నిర్వహణతో తల్లుల్లో అవగాహన పెరుగుతుందని, అ...

తబితా ఆశ్రమంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. చిన్నారులతో కేక్ కట్ చేసిన మద్దెల దినేష్

తబితా ఆశ్రమంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. చిన్నారులతో కేక్ కట్ చేసిన మద్దెల దినేష్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు.. చిన్నారులతో కలిసి మిత్రుల దినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖులు రామగుండం, ఆగస్టు 3 (ఇది మన హక్కు): రామగుండం నియోజకవర్గంలోని తబితా ఆశ్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిత్రుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమానికి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆశ్రమంలోని చిన్నారులకు కేక్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులందరూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్ పిల్లలను సొంత పిల్లల్లా చూసుకుంటూ పెంచుతున్న తీరు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు తొడుపునూరి రమేష్ కుమార్, ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు ఎం.ఏ. గౌస్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై...