రామగుండం నగరపాలక సంస్థలో 17 మంది సిబ్బందికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు..
రామగుండం నగరపాలక సంస్థలో 17 మంది సిబ్బందికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందజేత
రామగుండం, ఆగస్టు 15 (ఇది మన హక్కు): ఉత్తమ సేవలు అందించినందుకు రామగుండం నగరపాలక సంస్థకు చెందిన 17 మంది సిబ్బందికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందజేశారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని గుర్తించి ఈ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా నగరపాలక సంస్థ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఉత్తమ సేవలకు గుర్తింపు లభించడంపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. తమ విధులను మరింత బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ జె. అరుణ శ్రీ ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు అందిస్తున్న సేవల్లో సిబ్బంది చూపుతున్న కృషిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి