రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు! మీ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందా?
SIRలో భారీగా ఓటర్ల పేర్లు గల్లంతు.. ఫారం 6, 7, 8తో అభ్యంతరాలకు అవకాశం | 5,500 నో మ్యాపింగ్, 49,034 అనామలీస్ ఓటర్లకు నోటీసులు
రామగుండం ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న 60 డివిజన్లలో వార్డు సభలు!
రామగుండం, ఆగస్టు 25 (ఇది మన హక్కు): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఈ నెల 27వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ తెలిపారు.
🔹 ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను చదవడం
🔹 ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించడం
🔹 ఫారం 6, 7, 8 స్వీకరించడం
🔹 అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తప్పిపోకుండా చూడడం
కోసం ఈ వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
రామగుండం నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,13,990 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 1,83,233 మంది ఓటర్ల పేర్లు మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే నో మ్యాపింగ్ కింద 5,500 మందికి, అనామలీస్ కింద 49,034 మందికి నోటీసులు జారీ చేసి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్వీకరించాలని అధికారులకు సూచించారు.
నిర్ణీత గడువులో SIR ప్రక్రియను పూర్తి చేసి, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జె. అరుణ శ్రీ అధికారులను ఆదేశించారు.
ఎన్‌టీపీసీ మిలీనియం హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల తహశీల్దార్లు రవీందర్, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య గమనిక:
రామగుండం పరిధిలోని ఓటర్లు ఈ నెల 27న తమ డివిజన్‌లో నిర్వహించే వార్డు సభకు హాజరై, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి