6, ఆగస్టు 2026, గురువారం

జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక చేయూత వి.ఎస్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.1,000 అందజేత

 ఇది మన హక్కు పెద్దపెల్లి జిల్లా బ్యూరో రిపోర్టర్✍️

జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక చేయూత వి.ఎస్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.1,000 అందజేత

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సీహెచ్ కిషోర్ సాయం.. తొలి విడతగా రూ.3,000 అందజేత

రామగుండం, ఆగస్టు 6 : { ఇది మన హక్కు} : 

ఆర్థిక ఇబ్బందులతో జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యను కొనసాగిస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీకి చెందిన విద్యార్థిని సిరివేన అక్షయకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ (VSSS) ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు..గోదావరిఖని మేదర్‌బస్తిలోని చంద్రశేఖర్ కిరాణా మర్చంట్ నిర్వాహకులు సీహెచ్ కిషోర్, తన తండ్రి సీహెచ్ చంద్రశేఖర్ జ్ఞాపకార్థం విద్యార్థిని జీఎన్‌ఎమ్ మూడేళ్ల కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి నెల రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మూడు నెలలకు సంబంధించిన రూ.3,000ను విద్యార్థినికి అందజేశారు..

ఈ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ డా. సురభి శ్రీధర్ మాట్లాడుతూ, సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అక్షయ ప్రస్తుతం అమ్మమ్మ వద్ద ఉంటూ, ఆమె కూలి పని చేసి చదివిస్తోందని చెప్పారు. విద్యార్థిని చదువుకు సహాయం కోరగా సీహెచ్ కిషోర్ స్పందించి మూడు సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థిని చదువుకు చేయూతనిస్తున్న సీహెచ్ కిషోర్ మరియు వారి కుటుంబ సభ్యులకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ తరఫున డా. సురభి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ గడవేన సదానందం, విద్యార్థిని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి