స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి : అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు
జిల్లా అధికారులతో సమీక్ష.. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాల..
రామగుండం, ఆగస్టు 6 (ఇది మన హక్కు): జిల్లాలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా వేడుకలకు హాజరు కావాలని సూచించారు.
ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం, డయాస్, సీటింగ్ ఏర్పాట్లు, భద్రత, వైద్య శిబిరాలు, అంబులెన్స్, తాగునీటి సదుపాయాలు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రాల పంపిణీతో పాటు ముఖ్య అతిథి సందేశానికి అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి