తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగు: నగర మేయర్ మహంకాళి స్వామి
తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపు
గోదావరిఖని, ఆగస్టు 6 (ఇది మన హక్కు): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ స్వాగత్ ఫంక్షన్ హాల్లో సీడీపీఓ అలేఖ్య ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, పుట్టిన శిశువుకు తల్లి పాలు అమృతంతో సమానమని, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లి పాల ప్రాధాన్యంపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు.
4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు మాట్లాడుతూ, తల్లి పాల వారోత్సవాల నిర్వహణతో తల్లుల్లో అవగాహన పెరుగుతుందని, అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం వంటి సంప్రదాయ కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం తల్లి పాల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేగొళపు రమాదేవి, 5వ డివిజన్ కార్పొరేటర్ సత్యప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, సూపర్వైజర్ జామున, ఇన్చార్జి అనిల్, అంగన్వాడీ సిబ్బంది బి. మంజుల, బి. శ్రీవాణి, ఎస్. రజిత, కే. అరుణ, బి. రాజలక్ష్మి, బి. సరోజ, కే. నర్మద, కే. స్వరూప, ఆశా వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు..




కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి