29, జులై 2026, బుధవారం

భారీ వర్షాలతో అప్రమత్తమైన కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు.. 4వ డివిజన్‌లో పర్యటించి సహాయక చర్యలు

భారీ వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వరి కాలనిలో పర్యటించిన కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు



రామగుండం, జూలై 29: 

భారీ వర్షాలతో అప్రమత్తమైన కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు.. 4వ డివిజన్‌లో పర్యటించి సహాయక చర్యలు


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే **రాజ్ ఠాకూర్** మరియు నగర మేయర్ **మహంకాళి స్వామి** ఆదేశాల మేరకు బుధవారం 4వ డివిజన్ కార్పొరేటర్ **కంకణాల మౌనిక రాజు** రాజరాజేశ్వరి కాలనితో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు..రాజరాజేశ్వరి కాలనిలో ఓపెన్ నాలా చెత్తతో నిండిపోవడంతో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి రోడ్డు కుంగిపోతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే మేయర్ దృష్టికి తీసుకెళ్లడంతో జేసీబీని పంపించి నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు..అదేవిధంగా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందన్న సమాచారం అందడంతో కార్పొరేటర్ స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నీరు త్వరగా బయటకు వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు..ఈ సందర్భంగా కార్పొరేటర్ **కంకణాల మౌనిక రాజు** మాట్లాడుతూ, భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తమకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ **సాయి కుమార్**, **చెరుకు బుచ్చి రెడ్డి**, **బాదం రవికుమార్**, **గొనె సత్యనారాయణ**, **రౌతు సత్యనారాయణ**, నాగార్జున**, **శ్రీను** తదితరులు పాల్గొన్నారు..

ఓపెన్ నాలా సమస్య


జేసీబీతో చెత్త తొలగింపు


అధికారులకు ఆదేశాలు


ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిపై చర్యలు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి