ఎన్. బలరాం నాయక్, IRS జన్మదినం సందర్భంగా మనస్ఫూర్తి సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కండె సాగర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం..
గోదావరిఖని, జూలై 29: ఎన్. బలరాం నాయక్, IRS గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వర్షాకాలంలో విధులు నిర్వహిస్తున్న RG2 ఏరియాలోని సింగరేణి పారిశుద్ధ్య కార్మికులకు స్లీపర్లు, రైన్‌కోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తి సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కండె సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.వర్షాకాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ భద్రతా సామగ్రిని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజానికి సేవ చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు..ఈ సేవా కార్యక్రమంలో అనేయ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆకుల నవీన్, ఉపాధ్యక్షుడు అవనిగంటి శ్రావణ్‌తో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అడిషనల్ కమిషనర్ (CGST & Customs)గా విధులు నిర్వహిస్తున్న ఎన్. బలరాం నాయక్, IRS గతంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో డైరెక్టర్ (ఫైనాన్స్), అనంతరం చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా విశిష్ట సేవలందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్షలాది మొక్కలు నాటేందుకు కృషి చేసి "ట్రీమ్యాన్ ఆఫ్ తెలంగాణ"గా గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎన్. బలరాం నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు..



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి