కోతుల దాడిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్రంగా గాయపాటు..! భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని కార్మిక సంఘం ఆగ్రహం
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
కోతుల దాడిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్రంగా గాయపాటు..! భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని కార్మిక సంఘం ఆగ్రహం..
గోదావరిఖని, జూలై 20 (ఇది మన హక్కు):
ఆర్జీ-2లోని 8 ఇంక్లైన్ కాలనీలో సింగరేణి సివిల్ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఓరుగంటి మహేందర్ విధుల్లో ఉండగా కోతుల దాడికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి కిందపడడంతో ఎడమ కాలు విరిగింది. ప్రస్తుతం ఆయన సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..బాధితుడిని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు శనగల శ్రీనివాస్, మద్దెల శ్రీనివాసులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. కోతుల బెడదపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు..గాయపడిన కార్మికుడికి కోలుకునే వరకు పూర్తి వేతనం చెల్లించడంతో పాటు, తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్మికుల తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు..
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి