పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

{✍️ఇది మన హక్కు సమాచార పత్రిక: గోదావరిఖని}

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఆలస్యం జరుగుతుందనే నిరసనగా ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు..తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది..

కామెంట్‌లు