పోస్ట్‌లు

మే, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

సన్మాన సత్కారాలతో పదవి విరమణ పొందిన- అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ సన్మాన సత్కారాలతో పదవి విరమణ పొందిన- అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల  పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు మోడల్ అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల 43 సంవత్సరాల పాటు చిన్నారుల భవిష్యత్తు కోసం అంకితభావంతో సేవలందించిన ఓ అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల పదవీ విరమణ పొందడం జరిగింది. ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో వేలాది మంది చిన్నారులకు విద్య, విలువలు అందించిన పెండ్యాల విమల ఆమె సేవలను గ్రామస్థులు, అధికారులు, సహచరులు ఘనంగా శాలువాలతో, పూల బొక్యాలతో ఘనంగా సత్కరించి టీచర్ పెండ్యాల విమల సేవలను కొనియాడారు.అలాగే  43 సంవత్సరాల క్రితం అంగన్వాడి టీచర్‌గా పెండ్యాల విమల తన సేవా ప్రయాణాన్ని ప్రారంభిన పెండ్యాల విమల అధికారికంగా పదవీ విరమణ పొందారు. ఉద్యోగాన్ని కేవలం బాధ్యతగా కాకుండా సేవగా భావించిన టీచర్ పెండ్యాల విమల ఆమె, చిన్నారుల విద్యా వికాసం కోసం నిరంతరం కృషి చేశారు.  పెండ్యాల విమల వద్ద చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతాధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు...

జిడికె 11వ ఇంక్లైన్ పిట్ ఇంజనీర్ రాందాస్‌ కు ఘన సన్మానం.పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్ట్ ✍️ జిడికె 11వ ఇంక్లైన్ పిట్ ఇంజనీర్ రాందాస్‌ కు ఘన సన్మానం. పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె 11వ ఇంక్లైన్‌ లో పిట్ ఇంజనీర్‌ గా విధులు నిర్వహించిన శ్రీ రాందాస్ శనివారం పదవీ విరమణ పొందిన సందర్భంగా, గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆధ్వర్యంలో గని పై ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను రాందాస్ దంపతులకు పూల బొకే అందించి, శాలువా కప్పి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాందాస్ గారి దంపతుల శేష జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గని అధికారులతో పాటు ఏఐటియుసి నాయకులు సిద్దమల్ల రాజు, నాయిని శంకర్, గొడిశల నరేష్, జాన్ కెనడీ, జక్కుల శ్రీనివాస్, వెంకటేష్, మల్లయ్య, పర్లపెల్లి రామస్వామి తదితరులు పాల్గొని రాందాస్ గారి సేవలను కొనియాడుతూ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

రామగుండం లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

చిత్రం
 ఇవి మన హక్కు రామగుండం మండల్ రిపోర్ట్ ✍️ రామగుండం లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలు మరియు బట్టల ను పంపిణి చేసారు. కొప్పుల శంకర్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు భవిష్యత్ లో ఇంకా గొప్ప స్థానాలని అధిరోహించాలని కొనియాడారు. ఈ కార్యక్రమం లో లీగల్ సెల్ నాయకులు మాదాసు శ్రీనివాస్, ముస్కె రవికుమార్, మహమ్మద్ తాజ్, సీనియర్ న్యాయవాదులు మేడ చక్రపాణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాల్వా లింగస్వామి, మారేల్లి రాజిరెడ్డి,నాయిని ఓదెలు కార్పొరేటర్ చిదురాల నాగరాజు, న్యాయవాదులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగ విరమణ --అధికారులు, ఆత్మీయుల సన్మానం

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగ విరమణ -అధికారులు, ఆత్మీయుల సన్మానం  సింగరేణి సంస్థలో 39 సంవత్సరాలపాటు సుదీర్ఘకాలం సేవలందించి ఆర్జీ-3 ఓసియం-1లో ఈపీ ఫిట్టర్‌గా ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్ ను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సహోద్యోగులు ఘనంగా సన్మానించారు. శనివారం ఓసియం-1 బేస్ వర్క్‌షాప్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రవీణ్ కుమార్, ప్రభావతి దంపతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. విధుల్లో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని ప్రశంసించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగిని సంస్థ కోల్పోవడం నష్టమే అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనివార్యమని పేర్కొన్నారు. అనంతరం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్ కుమార్‌ను సన్మానించి షటిల్ రాకెట్‌ను బహుకరించా...

వివాహ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మద్దెల దినేష్ దంపతులు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ వివాహ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మద్దెల దినేష్ దంపతులు కులాంతర వివాహం చేసుకొని మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ తన సతీమణి సౌజన్య తో కలిసి గోదావరిఖనిలోని మున్సిపల్ టి జంక్షన్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనకు కులాంతర వివాహాలు అత్యంత అవసరమని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావించారని, ఆ స్ఫూర్తితో అనేక మంది నూతన దంపతులు కులాంతర వివాహం చేసుకున్న తర్వాత తమ జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఆదర్శ వివాహాలను ప్రోత్సహించడానికి మరియు కులరహిత సమాజ స్థాపనకు అడుగులు వేస్తున్న దంపతులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు స్ఫూర్తిదాయకమని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా వివాహాలు చేసుకోవడం వల్ల సామాజిక ఐక్యత పెరుగుతుందని నాడే అంబేద్కర్ సూచించారని గుర్తు చేశారు. కు...

పెద్దంపేట రచ్చగుట్టను కాపాడాలి – తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలి: CPI ML మాస్ లైన్ ప్రజాపంథాపెద్దంపేట

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టు ✍️ పెద్దంపేట రచ్చగుట్టను కాపాడాలి – తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలి: CPI ML మాస్ లైన్ ప్రజాపంథా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో మంగళవారం CPI ML మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఆడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య పాల్గొని మాట్లాడారు. పెద్దంపేట గ్రామానికి ప్రకృతి సంపదగా, చారిత్రక ప్రాధాన్యం కలిగిన రచ్చగుట్టను అక్రమంగా తవ్వుతూ మట్టిని తరలించడం తీవ్ర ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. రైల్వే, రోడ్డు పనుల పేరుతో రచ్చగుట్టను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం, కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రచ్చగుట్టను కాపాడుతామని అధికార పార్టీ, గ్రామ పాలకవర్గం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, మాటలకే పరిమితం కాకుండా తక్షణమే తవ్వకాలను నిలిపివేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పాలకవర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇప్పటికీ తవ్వకాలు కొనసా...

అక్రిడేషన్ కార్డ్స్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలి జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ అనర్హుల్ని తొలగించాలని జెఎస్ఎస్ డిమాండ్ అక్షర జ్ఞానం లేని వారు కూడా జర్నలిస్టులేనా వార్తలు రాయనివారు జర్నలిస్టులను తొలగించాలి.

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ అక్రిడేషన్ కార్డ్స్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలి.. * జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్.. * అనర్హుల్ని తొలగించాలని జెఎస్ఎస్ డిమాండ్.. * అక్షర జ్ఞానం లేని వారు కూడా జర్నలిస్టులేనా..  * వార్తలు రాయనివారు జర్నలిస్టులను తొలగించాలి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని జెఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడలేని విధంగా పెద్దపల్లి జిల్లాలో అనర్హులు అక్రిడేషన్లు అందుకుంటున్నారని, జిల్లాలో ప్రభుత్వం రేషన్ షాప్ డీలర్లు,వ్యాపారస్తులు, అక్రిడియేషన్స్ 30 వేల నుండి 40 వేల వరకు కొనుగోలు చేస్తున్నారని, నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని, ఒక సంస్థలో పని చేస్తూ వేరొక సంస్థ ద్వారా అక్రిడేషన్స్ పొందుతున్నారని, ఒక నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎస్బి ఎంక్వైరీ, ఇంటలిజెంట్ ఎంక్వ...

కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు – హెచ్‌ఎంఎస్ ఆగ్రహంకోల్ ఇండియా ఒప్పంద వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు – హెచ్‌ఎంఎస్ ఆగ్రహం కోల్ ఇండియా ఒప్పంద వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ ఈరోజు ఉదయం 10 గంటలకు చౌరస్తాలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ ఆరేళ్లి పోషం ఆధ్వర్యంలో హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తూ కార్మికులను మోసం చేస్తోందని ఆరోపించారు. కోల్ ఇండియాలో హెచ్‌ఎంఎస్‌తో పాటు జేబీసీసీఐ సంఘాలు కుదుర్చుకున్న వేతన ఒప్పందాలను అమలు చేయకుండా, తక్కువ వేతనాలు ప్రకటించడం అన్యాయమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కాంట్రాక్ట్ కార్మికుల కడుపుకొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నాయని విమర్శించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. తక్కువ వేతనాలు ప్రకటించి గ...

జూల వంశీ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలివంశీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ జూల వంశీ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి వంశీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన జూల వంశీని దారుణంగా హత్య చేసిన వారిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపెళ్లి సతీష్, ఇరుగురాల భాగ్యలక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ సింగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి జూల వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో గౌడ సామాజిక వర్గానికి చెందిన నీలం అలేఖ్యకు పూర్తి స్థాయిలో పాత్ర ఉందని ఆరోపించారు. ప్రేమ వ్...

పాలిసెట్‌లో 971 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం

చిత్రం
  ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ పాలిసెట్‌లో 971 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం గోదావరిఖని, సంజయ్ గాంధీనగర్‌లోని శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థి ముక్కెర సూర్య తేజ TG POLYCET-2026 పరీక్షలో MPC విభాగంలో రాష్ట్ర స్థాయిలో 971 ర్యాంక్ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జోజి రెడ్డి సర్, డైరెక్టర్ అమిత్ సర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్ విద్యార్థిని అభినందించచారు. అలాగే సిబ్బంది సభ్యులు కిషోర్ సర్ మరియు సందీప్ సర్ విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ జోజి రెడ్డి సర్, డైరెక్టర్ అమిత్ సర్ మరియు  ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్ విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

చనిపోయిన హోం గార్డ్‌కు నివాళులు అర్పించిన పెద్దపల్లి డీసీపీ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ చనిపోయిన హోం గార్డ్‌కు నివాళులు అర్పించిన పెద్దపల్లి డీసీపీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ బి.శ్రీనివాస్ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి గోదావరిఖని శ్రీనగర్ కాలనీ (వినాయక్ నగర్)లోని ఆయన నివాసానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ... 1996 సంవత్సరంలో హోంగార్డ్‌గా ఎంపికైన బి.శ్రీనివాస్ గత 30 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో నిబద్ధతతో, నిజాయితీతో ప్రజా సేవలో అహర్నిశలు శ్రమించారని తెలిపారు.ఆయన ఆకస్మిక మరణం పోలీస్ శాఖకు, కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి తీరని లోటని పేర్కొన్నారు.ఆయన సేవలను చిరస్థాయిగా స్మరించుకుంటామని, కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, ఓర్పు కలగాలని దేవుణ్ణ...

కొడుకుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు… రామిళ్ల దంపతులకు ప్రశంసలు

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ కొడుకుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు… రామిళ్ల దంపతులకు ప్రశంసలు గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం–మంగళ దంపతులు కరోనా కారణంగా వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులను కోల్పోయిన తీవ్ర విషాదాన్ని సేవా మార్గంగా మలుచుకుని గత ఐదు సంవత్సరాలుగా సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శనివారం తమ కుమారుడు రామిళ్ల శైలేంద్రకుమార్ ఐదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఫైవ్ ఇంక్లైన్ ప్రాంతంలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. అలాగే పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి సమాజ సేవలో నిమగ్నమవుతున్న రామిళ్ల దంపతుల సేవా స్పూర్తి అభినందనీయమన్నారు. సమాజంలోని దాతలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని నిరాశ్రయులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామిల్ల కుటుంబ సభ్యులు శైలజ, వైష్ణవి, వణుష్ణ, రాజేంద్రకుమార్, జ్యోతి, విశ్వజిత్, నిత్యసాయి, మహేంద్ర కుమార్, సుప్రియ, కృతిక్, రవీంద్రకుమార్, గ...

వర్షాకాల సమస్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలి : కార్పొరేటర్ నెలకంటి రాము

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ వర్షాకాల సమస్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలి : కార్పొరేటర్ నెలకంటి రాము గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము డివిజన్ సివిల్ ఇంజనీర్‌ను వెంట తీసుకుని డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. 🔹 గల్లీ గల్లీ తిరిగి సమస్యాత్మక ప్రాంతాల పరిశీలన 🔹 వర్షాలతో ఇబ్బంది కలిగే ప్రాంతాల గుర్తింపు 🔹 తక్షణమే సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు 🔹 ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక ఈ సందర్భంగా కార్పొరేటర్ నెలకంటి రాము మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచనల మేరకు ప్రతి లైన్‌లో తిరిగి వర్షాల సమయంలో ఇబ్బందులు కలిగే ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో AE అన్వేష్, డివిజన్ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు, వార్డు ఆఫీసర్ సాయి, పెళ్లి కులస్త...

ప్రతి పౌరుడికి రూ.5 కోట్ల ఆర్థిక భరోసా కల్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన డా|| మార్షల్ దుర్గం నగేష్ సమాన ఆర్థిక హక్కులతోనే సామాజిక న్యాయం సాధ్యం

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ప్రతి పౌరుడికి రూ.5 కోట్ల ఆర్థిక భరోసా కల్పించాలి   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన డా|| మార్షల్ దుర్గం నగేష్ సమాన ఆర్థిక హక్కులతోనే సామాజిక న్యాయం సాధ్యం దేశ సంపదలో ప్రతి పౌరుడికి సమాన వాటా కల్పిస్తూ రూ.5 కోట్ల ఆర్థిక భరోసా పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా|| మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్తులను ప్రజల అభ్యున్నతికి వినియోగించాలని సూచించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు భూములు, ఆస్తులు, షేర్లు, ఇతర వనరులను అందించి ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు.“దేశ సంపదను మన పూర్వీకులు నిర్మించారు. ఆ సంపదపై ప్రతి పౌరుడికీ సమాన హక్కు ఉంది. ప్రభుత్వాలు సంకల్పిస్తే ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం సాధ్యమే” అని డా|| నగేష్ పేర్కొన్నారు.అనాథలు, నిరుపేదలు, వృద్ధులకు ప...

మంచివారికి ఎప్పటికీ మంచే జరుగుతుంది : మేయర్ మహంకాళి స్వామి

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ మంచివారికి ఎప్పటికీ మంచే జరుగుతుంది : మేయర్ మహంకాళి స్వామి  ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ గారి సతీమణి కొంకటి దేవమ్మ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుండగా కరీంనగర్‌లోని ఆస్పత్రిలో స్టంట్ వేయించారు. అనంతరం కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వచ్చిన తరువాత మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెళ్లి ఎల్లయ్య కలిసి గాంధీనగర్‌లోని కొంకటి లక్ష్మణ్ స్వగృహానికి వెళ్లి దేవమ్మను పరామర్శించారు. 🔹 కొంకటి లక్ష్మణ్‌కు మనోధైర్యం నింపుతూ పరామర్శ 🔹 “మంచివారికి ఎప్పటికీ మంచే జరుగుతుంది” అని భరోసా 🔹 మంచి పనులు చేస్తే భగవంతుని ఆశీస్సులు తప్పక ఉంటాయని సూచన 🔹 వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, దిగులు పడవద్దని ధైర్యం ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, మనం చేసే మంచి పనుల ద్వారానే భగవంతుని కృప లభిస్తుందని, ప్రస్తుతం వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, త్వరలోనే కొంకటి దేవమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గట్ల రమేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్...

మోకు కట్టి తాటికల్లు, ఇతచెట్టు గీసి కులవృత్తిని కాపాడిన యువ గౌడ్-మడ్డి హేమసుందర్ గౌడ్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️ మోకు కట్టి తాటికల్లు, ఇతచెట్టు గీసి కులవృత్తిని కాపాడిన యువ గౌడ్-మడ్డి హేమసుందర్ గౌడ్  అంతర్గాం మండలంలోని గౌడ కులస్తులకు అతి చిన్న వయసులోనే కులవృత్తిని ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచిన- యువ గౌడ్ మడ్డి హేమంత్ గౌడ్  పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం బ్రాహ్మణపల్లి గ్రామంలో మడ్డి హేమాసుందర్ గౌడ్ తండ్రి మహేష్ గౌడ్ వారసత్వంగా వచ్చే కుల వృత్తికి నేను కట్టబడి ఉంటానని అతి చిన్న వయసు నుండి అంటే సుమారు 15 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి మడ్డి హేమసుందర్ గౌడ్ ఈత చెట్టు,తాటి చెట్టు ఎక్కి కులవృత్తి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మడ్డి హేమసుందర్ గౌడ్ తండ్రి మహేష్ గౌడ్ ప్రస్తుతం రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతూ మడ్డి హేమ సుందర్ గౌడ్ తాను గత సంవత్సర కాలం నుండి తన పెద్దబాబు అయినటువంటి భాస్కర్ గౌడ్ తనకి ఈత చెట్టు గీయడం, తాటి చెట్టు ఎక్కడం నేర్పించడం జరిగింది.ఈ వృత్తిని నేర్పినటువంటి మా పెద్దబాపు భాస్కర్ గౌడ్ పెద్దనాన్నను ఎప్పటికీ కూడా మర్చిపోనని యావ...

SCCL RG1 ఆఫీస్ ముందు విశ్వహిందూ పరిషత్ ధర్నా

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ SCCL RG1 ఆఫీస్ ముందు విశ్వహిందూ పరిషత్ ధర్నా  గోదావరిఖని నడి బొడ్డున సింగరేణి సంస్థ గతంలో ప్రజల కోసం నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ (మరుగుదొడ్డిని) కూల్చి అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన క్రైస్తవ చర్చి..  పట్టింపు లేనట్టుగా మత పరమైన దురాక్రమణపై చర్యలు తీసుకోకుండా కల్లు మూసుకున్న సింగరేణి RG1 యాజమన్య తీరుకు నిరసనగా విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో.. ధర్నా.  తేది: 23.05.26  స్థలం: RG1 GM ఆఫీస్  సమయం: 10.00 గం.లకి.  హిందు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేద్దాం, హిందు సంఘటనతో మత పరమైన దురాక్రమణకి అడ్డుకట్ట వేద్దాం విశ్వహిందూ పరిషత్  బజరంగ్ దళ్ గోదావరిఖని శాఖ పిలుపు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోటరైజ్డ్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 20 మంది లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి, వారి స్వావలంబనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్ర...

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు ఉద్యాన శాఖ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో ఉద్యాన శాఖ, ఆయిల్ పామ్ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి జిల్లాకు 1150 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం నిర్దేశించామని, ఇప్పటివరకు 370 ఎకరాలకు రైతులు ముందుకు వచ్చి డీడీలు చెల్లించారని తెలిపారు. లక్ష్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. రైతుల నుంచి డీడీలు సేకరించడంతో పాటు మొక్కల సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ పనులు వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన శాఖ అమలు చేస్తున్న ఇతర పథకాల లక్ష్యాలను కూడా సమయానికి పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిహెచ్‌ఎస్‌వో జగన్మోహన్ రెడ్డి, ఉద్య...

రామగుండంలొ రూ.1.80 కోట్ల డి.ఐ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ రామగుండంలొ రూ.1.80 కోట్ల డి.ఐ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన  ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం నగర ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు బి పవర్ హౌస్ నుండి మజీద్ టర్నింగ్ వరకు ఉన్న పాత 500 ఎంఎం పైప్‌లైన్ స్థానంలో నూతన 500 ఎంఎం డి.ఐ పైప్‌లైన్ ఏర్పాటు కోసం రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అంశమన్నారు. పాత పైప్‌లైన్ల కారణంగా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ నూతన పైప్‌లైన్ ఏర్పాటు పూర్తయిన తర్వాత నీటి సరఫరా మరింత మెరుగుపడి, లీకేజీలు తగ్గి ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ...

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై కమిటీ సభ్యుడు రాములు నాయక్‌తో తెలంగాణ ఉద్యమకారుల వేదిక భేటీ

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై కమిటీ సభ్యుడు రాములు నాయక్‌తో తెలంగాణ ఉద్యమకారుల వేదిక భేటీ ఉద్యమకారుల వేదిక (TUV Regd No.74/2026) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణ భవన్‌లో రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ గార్లు మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం నియమించిన కమిటీ సభ్యుడు రాములు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సమస్యలపై నరాల సత్యనారాయణ, తోడేటి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ రాములు నాయక్‌తో చర్చించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటిస్తూ సమగ్ర నివేదిక రూపొందించి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడి సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది మన హక్కు సమాచార పత్రిక ✍️

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ఆకెనపల్లి సర్పంచ్ స్రవంతి సుధాకర్

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అకెనపల్లి సర్పంచ్ స్రవంతి సుధాకర్ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆకెనపల్లి గ్రామ సర్పంచ్ స్రవంతి సుధాకర్ అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో ఐకేపీ కేంద్రాల్లో క్వింటాల్‌కు 10 నుంచి 15 కిలోల తరుగు పేరిట రైతులను దోచుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఎమ్మెల్యే చొరవతో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. అంతర్గాం మండలంలో లారీల కొరత లేకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని, వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని చెప్పారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలిచిందన్నారు. అలాగే ఎన్టీపీసీ, మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారదర్శక నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వందల కోట్ల నిధులతో రోడ్లు, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ న...

ఎల్బీనగర్‌లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ ఫ్లోర్ లీడర్, 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య

చిత్రం
 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ ఎల్బీనగర్‌లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ ఫ్లోర్ లీడర్, 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 41వ డివిజన్ ఎల్బీనగర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ ఫ్లోర్ లీడర్, 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం నాణ్యతతో కూడిన ఇందిరమ్మ చీరలను అందించడం హర్షణీయమన్నారు. మహిళల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తోందని, డ్వాక్రా మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ నాయకులు రాణవేణి సుధీర్, పోతరాజు నాగరాజు, మెప్మా ఆర్పీలు స్వర్ణలత, భాగ్య, సరోజ...