18, మే 2026, సోమవారం

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై కమిటీ సభ్యుడు రాములు నాయక్‌తో తెలంగాణ ఉద్యమకారుల వేదిక భేటీ

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై కమిటీ సభ్యుడు రాములు నాయక్‌తో తెలంగాణ ఉద్యమకారుల వేదిక భేటీ

ఉద్యమకారుల వేదిక (TUV Regd No.74/2026) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణ భవన్‌లో రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ గార్లు మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం నియమించిన కమిటీ సభ్యుడు రాములు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా ఉద్యమకారుల సమస్యలపై నరాల సత్యనారాయణ, తోడేటి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ రాములు నాయక్‌తో చర్చించారు.
ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటిస్తూ సమగ్ర నివేదిక రూపొందించి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడి సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి