అక్రిడేషన్ కార్డ్స్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలి జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ అనర్హుల్ని తొలగించాలని జెఎస్ఎస్ డిమాండ్ అక్షర జ్ఞానం లేని వారు కూడా జర్నలిస్టులేనా వార్తలు రాయనివారు జర్నలిస్టులను తొలగించాలి.

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

అక్రిడేషన్ కార్డ్స్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలి..
* జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్..
* అనర్హుల్ని తొలగించాలని జెఎస్ఎస్ డిమాండ్..
* అక్షర జ్ఞానం లేని వారు కూడా జర్నలిస్టులేనా.. 
* వార్తలు రాయనివారు జర్నలిస్టులను తొలగించాలి.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని జెఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడలేని విధంగా పెద్దపల్లి జిల్లాలో అనర్హులు అక్రిడేషన్లు అందుకుంటున్నారని, జిల్లాలో ప్రభుత్వం రేషన్ షాప్ డీలర్లు,వ్యాపారస్తులు, అక్రిడియేషన్స్ 30 వేల నుండి 40 వేల వరకు కొనుగోలు చేస్తున్నారని, నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని, ఒక సంస్థలో పని చేస్తూ వేరొక సంస్థ ద్వారా అక్రిడేషన్స్ పొందుతున్నారని, ఒక నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎస్బి ఎంక్వైరీ, ఇంటలిజెంట్ ఎంక్వయిరీ ఏ విధంగా వారిపై గతంలో ఏమైనా క్రిమినల్ కేసులు నమోదయాయని, విద్యార్హతలు ధృవీకరణ పత్రాలు నిజమైనవా..?కావా..? అని ఏ విధంగా ధ్రువీకరించుకుంటున్నారో అదేవిధంగా జర్నలిస్టులపై ఎంక్వయిరీ చేసి ధ్రువేకరించుకున్నాకనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కొంతమందిపై పోలీసు రికార్డులో క్రిమినల్ కేసులు, బ్లాక్మెయిల్ కేసులు ఉన్నవారికి కూడా అక్రిడేషన్ కార్డులు ఉండటం,నిజమైన వర్కింగ్ జర్నలిస్టు చేసుకున్న పాపం అనడంలో సందేహం లేదు అని అన్నరు.ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నేర్పించుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ అక్రిడేషన్ పై దృష్టి సాధించి నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జాతీయ కార్యదర్శి సబ్బితం లక్ష్మణ్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు వోడ్నాల లత, కన్నూరి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వోడ్నాల తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రఘు, ఉపాధ్యక్షులు రావుల రాజకుమార్, ప్రచార కార్యదర్శి అనిల్, జిల్లా కోశాధికారి ఉమేష్, సుమన్ టీవీ లావణ్య రెడ్డి, జెఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...