పెద్దంపేట రచ్చగుట్టను కాపాడాలి – తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలి: CPI ML మాస్ లైన్ ప్రజాపంథాపెద్దంపేట

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టు ✍️

పెద్దంపేట రచ్చగుట్టను కాపాడాలి – తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలి: CPI ML మాస్ లైన్ ప్రజాపంథా

అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో మంగళవారం CPI ML మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఆడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య పాల్గొని మాట్లాడారు.
పెద్దంపేట గ్రామానికి ప్రకృతి సంపదగా, చారిత్రక ప్రాధాన్యం కలిగిన రచ్చగుట్టను అక్రమంగా తవ్వుతూ మట్టిని తరలించడం తీవ్ర ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. రైల్వే, రోడ్డు పనుల పేరుతో రచ్చగుట్టను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం, కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రచ్చగుట్టను కాపాడుతామని అధికార పార్టీ, గ్రామ పాలకవర్గం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, మాటలకే పరిమితం కాకుండా తక్షణమే తవ్వకాలను నిలిపివేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పాలకవర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇప్పటికీ తవ్వకాలు కొనసాగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో ఇప్పటికే కాలుష్యం పెరిగి ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతోందని, పెద్దంపేట రచ్చగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. పోరాట వారసత్వం కలిగిన పెద్దంపేట గ్రామ ప్రజలంతా రచ్చగుట్ట రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గూడూరు వైకుంఠం, తూల్ల శంకర్, మాజీ సర్పంచ్ మార్త రాద, కోడిపుంజుల లక్ష్మి, బుర్ర బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...