లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

అనుమానితుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

గోదావరిఖని వన్‌టౌన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు

రామగుండం పోలీస్ కమిషనరేట్,పెద్దపల్లి జోన్,గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో ఈరోజు గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక లాడ్జీలు,హోటళ్ల యజమానులు మరియు మేనేజర్లకు ఇన్స్పెక్టర్ పలు కీలక సూచనలు జారీ చేశారు.
లాడ్జీలు,హోటళ్లలో బసకు వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా ఆధార్ కార్డు పరిశీలించాలని ఆదేశించారు.గది బుక్ చేసుకునే వ్యక్తుల పూర్తి చిరునామా, ఫోన్ నంబర్,గుర్తింపు వివరాలు నమోదు చేయాలని సూచించారు.అలాగే సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు.అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు గాని, పాత నేరస్తులుగా అనుమానం కలిగే వ్యక్తులు గాని ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కొంతమంది తప్పుడు సెల్‌ఫోన్ నంబర్లు ఇస్తున్నట్లు సమాచారం ఉందని, అందువల్ల ఫోన్ నంబర్లను కూడా ఒకసారి ధృవీకరించుకోవాలని తెలిపారు.లాడ్జీలు, హోటళ్లలో మద్యం సేవించడం లేదా బయట నుంచి తీసుకువచ్చి మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.అలాగే కొంతమంది బయట వ్యక్తులు వచ్చి పేకాట ఆడుతున్నారనే సమాచారం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే లాడ్జి మేనేజర్లు, యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ముఖ్యంగా మైనర్ బాలికలు, మహిళలు లేదా యువతులు లాడ్జీలు, హోటళ్లకు వచ్చినప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వారు ఏ ఉద్దేశంతో వచ్చారో నిర్ధారించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులతో వచ్చారా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలని పేర్కొన్నారు.ఒకవేళ మైనర్ బాలికలు ఒంటరిగా వచ్చినట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలీసుల ఆదేశాలు, సూచనలు ప్రతి లాడ్జి, హోటల్ యజమాని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...