రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ఆకెనపల్లి సర్పంచ్ స్రవంతి సుధాకర్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అకెనపల్లి సర్పంచ్ స్రవంతి సుధాకర్
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆకెనపల్లి గ్రామ సర్పంచ్ స్రవంతి సుధాకర్ అన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో ఐకేపీ కేంద్రాల్లో క్వింటాల్‌కు 10 నుంచి 15 కిలోల తరుగు పేరిట రైతులను దోచుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఎమ్మెల్యే చొరవతో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు.
అంతర్గాం మండలంలో లారీల కొరత లేకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని, వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని చెప్పారు.
రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలిచిందన్నారు. అలాగే ఎన్టీపీసీ, మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారదర్శక నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వందల కోట్ల నిధులతో రోడ్లు, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కామెంట్‌లు