30, మే 2026, శనివారం

జిడికె 11వ ఇంక్లైన్ పిట్ ఇంజనీర్ రాందాస్‌ కు ఘన సన్మానం.పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్ట్ ✍️

జిడికె 11వ ఇంక్లైన్ పిట్ ఇంజనీర్ రాందాస్‌ కు ఘన సన్మానం.
పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు.

సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె 11వ ఇంక్లైన్‌ లో పిట్ ఇంజనీర్‌ గా విధులు నిర్వహించిన శ్రీ రాందాస్ శనివారం పదవీ విరమణ పొందిన సందర్భంగా, గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆధ్వర్యంలో గని పై ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను రాందాస్ దంపతులకు పూల బొకే అందించి, శాలువా కప్పి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాందాస్ గారి దంపతుల శేష జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గని అధికారులతో పాటు ఏఐటియుసి నాయకులు సిద్దమల్ల రాజు, నాయిని శంకర్, గొడిశల నరేష్, జాన్ కెనడీ, జక్కుల శ్రీనివాస్, వెంకటేష్, మల్లయ్య, పర్లపెల్లి రామస్వామి తదితరులు పాల్గొని రాందాస్ గారి సేవలను కొనియాడుతూ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి