కొడుకుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు… రామిళ్ల దంపతులకు ప్రశంసలు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
కొడుకుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు… రామిళ్ల దంపతులకు ప్రశంసలు
గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం–మంగళ దంపతులు కరోనా కారణంగా వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులను కోల్పోయిన తీవ్ర విషాదాన్ని సేవా మార్గంగా మలుచుకుని గత ఐదు సంవత్సరాలుగా సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
శనివారం తమ కుమారుడు రామిళ్ల శైలేంద్రకుమార్ ఐదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఫైవ్ ఇంక్లైన్ ప్రాంతంలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. అలాగే పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి సమాజ సేవలో నిమగ్నమవుతున్న రామిళ్ల దంపతుల సేవా స్పూర్తి అభినందనీయమన్నారు. సమాజంలోని దాతలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని నిరాశ్రయులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రామిల్ల కుటుంబ సభ్యులు శైలజ, వైష్ణవి, వణుష్ణ, రాజేంద్రకుమార్, జ్యోతి, విశ్వజిత్, నిత్యసాయి, మహేంద్ర కుమార్, సుప్రియ, కృతిక్, రవీంద్రకుమార్, గురుపాదం, మిత్రులు మేజిక్ రాజా, మేజిక్ హరి, చంద్రపాల్, ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు