ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు ఉద్యాన శాఖ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో ఉద్యాన శాఖ, ఆయిల్ పామ్ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి జిల్లాకు 1150 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం నిర్దేశించామని, ఇప్పటివరకు 370 ఎకరాలకు రైతులు ముందుకు వచ్చి డీడీలు చెల్లించారని తెలిపారు. లక్ష్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
రైతుల నుంచి డీడీలు సేకరించడంతో పాటు మొక్కల సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ పనులు వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన శాఖ అమలు చేస్తున్న ఇతర పథకాల లక్ష్యాలను కూడా సమయానికి పూర్తి చేయాలని తెలిపారు.
జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో డిహెచ్‌ఎస్‌వో జగన్మోహన్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు