కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగ విరమణ --అధికారులు, ఆత్మీయుల సన్మానం

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగ విరమణ -అధికారులు, ఆత్మీయుల సన్మానం 

సింగరేణి సంస్థలో 39 సంవత్సరాలపాటు సుదీర్ఘకాలం సేవలందించి ఆర్జీ-3 ఓసియం-1లో ఈపీ ఫిట్టర్‌గా ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్ ను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సహోద్యోగులు ఘనంగా సన్మానించారు. శనివారం ఓసియం-1 బేస్ వర్క్‌షాప్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రవీణ్ కుమార్, ప్రభావతి దంపతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. విధుల్లో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని ప్రశంసించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగిని సంస్థ కోల్పోవడం నష్టమే అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనివార్యమని పేర్కొన్నారు. అనంతరం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్ కుమార్‌ను సన్మానించి షటిల్ రాకెట్‌ను బహుకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు శంకర్, పాపయ్య, సుధాకర్ రెడ్డి, కాశీ విశ్వేశ్వర్ రావు, నసీర్ అహ్మద్, రఘు కుమార్, సత్యనారాయణ, సాయి స్వరూప్, కార్మిక సంఘాల నాయకులు నక్క రమేష్, సదానందం, క్రీడాకారులు హరికిషన్, ముకేశ్ కుమార్, చంద్రపాల్, శేషగిరి, అల్లం రమేష్, కేఎల్‌ఎన్ ప్రసాద్, గంధం శ్రీనివాస్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివ, బుగ్గాజి, జక్కుల దామోదర్, పూర్ణాకర్, వాసు, రవి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...