మంచివారికి ఎప్పటికీ మంచే జరుగుతుంది : మేయర్ మహంకాళి స్వామి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
మంచివారికి ఎప్పటికీ మంచే జరుగుతుంది : మేయర్ మహంకాళి స్వామి
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ గారి సతీమణి కొంకటి దేవమ్మ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుండగా కరీంనగర్‌లోని ఆస్పత్రిలో స్టంట్ వేయించారు. అనంతరం కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వచ్చిన తరువాత మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెళ్లి ఎల్లయ్య కలిసి గాంధీనగర్‌లోని కొంకటి లక్ష్మణ్ స్వగృహానికి వెళ్లి దేవమ్మను పరామర్శించారు.
🔹 కొంకటి లక్ష్మణ్‌కు మనోధైర్యం నింపుతూ పరామర్శ
🔹 “మంచివారికి ఎప్పటికీ మంచే జరుగుతుంది” అని భరోసా
🔹 మంచి పనులు చేస్తే భగవంతుని ఆశీస్సులు తప్పక ఉంటాయని సూచన
🔹 వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, దిగులు పడవద్దని ధైర్యం
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, మనం చేసే మంచి పనుల ద్వారానే భగవంతుని కృప లభిస్తుందని, ప్రస్తుతం వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, త్వరలోనే కొంకటి దేవమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గట్ల రమేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపెళ్లి సతీష్, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఎంవో రాజేందర్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు విజయ్, మాజీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు