19, మే 2026, మంగళవారం

రామగుండంలొ రూ.1.80 కోట్ల డి.ఐ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్


 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

రామగుండంలొ రూ.1.80 కోట్ల డి.ఐ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన 
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

రామగుండం నగర ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు బి పవర్ హౌస్ నుండి మజీద్ టర్నింగ్ వరకు ఉన్న పాత 500 ఎంఎం పైప్‌లైన్ స్థానంలో నూతన 500 ఎంఎం డి.ఐ పైప్‌లైన్ ఏర్పాటు కోసం రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు.

రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అంశమన్నారు. పాత పైప్‌లైన్ల కారణంగా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

ఈ నూతన పైప్‌లైన్ ఏర్పాటు పూర్తయిన తర్వాత నీటి సరఫరా మరింత మెరుగుపడి, లీకేజీలు తగ్గి ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి