ఎల్బీనగర్‌లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ ఫ్లోర్ లీడర్, 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ఎల్బీనగర్‌లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ ఫ్లోర్ లీడర్, 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 41వ డివిజన్ ఎల్బీనగర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ ఫ్లోర్ లీడర్, 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం నాణ్యతతో కూడిన ఇందిరమ్మ చీరలను అందించడం హర్షణీయమన్నారు.
మహిళల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తోందని, డ్వాక్రా మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ నాయకులు రాణవేణి సుధీర్, పోతరాజు నాగరాజు, మెప్మా ఆర్పీలు స్వర్ణలత, భాగ్య, సరోజనతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
కామెంట్‌లు