సన్మాన సత్కారాలతో పదవి విరమణ పొందిన- అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
సన్మాన సత్కారాలతో పదవి విరమణ పొందిన- అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు మోడల్ అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల 43 సంవత్సరాల పాటు చిన్నారుల భవిష్యత్తు కోసం అంకితభావంతో సేవలందించిన ఓ అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల పదవీ విరమణ పొందడం జరిగింది. ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో వేలాది మంది చిన్నారులకు విద్య, విలువలు అందించిన పెండ్యాల విమల ఆమె సేవలను గ్రామస్థులు, అధికారులు, సహచరులు ఘనంగా శాలువాలతో, పూల బొక్యాలతో ఘనంగా సత్కరించి టీచర్ పెండ్యాల విమల సేవలను కొనియాడారు.అలాగే
43 సంవత్సరాల క్రితం అంగన్వాడి టీచర్‌గా పెండ్యాల విమల తన సేవా ప్రయాణాన్ని ప్రారంభిన పెండ్యాల విమల అధికారికంగా పదవీ విరమణ పొందారు. ఉద్యోగాన్ని కేవలం బాధ్యతగా కాకుండా సేవగా భావించిన టీచర్ పెండ్యాల విమల ఆమె, చిన్నారుల విద్యా వికాసం కోసం నిరంతరం కృషి చేశారు.
పెండ్యాల విమల వద్ద చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతాధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానాల్లో రాణిస్తున్నారు. వారి విజయాలకు పునాది వేసిన గురువుగా పెండ్యాల విమలకు ప్రత్యేక గుర్తింపు లభించింది.పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు, గ్రామ పెద్దలు, సహచర ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు పాల్గొని ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఆమె చేసిన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ చిన్నారులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యం. వారి విజయాలను చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది" అని పదవీ విరమణ పొందిన టీచర్ పెండ్యాల విమల భావోద్వేగంగా తెలిపారు. అనంతరంనాలుగు దశాబ్దాలకు పైగా చిన్నారుల అభివృద్ధికి అంకితమైన ఈ అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల గురువు సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి గాంభీరావుపేట తిరుపతి, గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్, కార్యదర్శి ఎస్ కమల, పెద్దపల్లి జిల్లా పిడి వేణుగోపాలరావు, సిడిపిఓ అలేఖ్య పటేల్, సిడిపిఓ స్వరూప రాణి, బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి - లత దంపతులు, అంగన్వాడీ టీచర్స్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, గూడూరు మాజీ ఎంపీటీసీ బొడ్డు రాయమల్లు,గూడూరు శివాలయ ఆలయ కమిటీ అధ్యక్షులు బియ్యాల సుధాకర్ నిర్మల్ కాలేజ్ లెక్చరర్స్, పదవి విరమణ పొందిన పెండ్యాల విమల- సత్యనారాయణ శర్మ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు