జూల వంశీ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలివంశీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

జూల వంశీ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి
వంశీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన జూల వంశీని దారుణంగా హత్య చేసిన వారిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.

ఆదివారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపెళ్లి సతీష్, ఇరుగురాల భాగ్యలక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ సింగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి జూల వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో గౌడ సామాజిక వర్గానికి చెందిన నీలం అలేఖ్యకు పూర్తి స్థాయిలో పాత్ర ఉందని ఆరోపించారు. ప్రేమ వ్యవహారం బయటపడటంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం అలేఖ్య భర్త ముండూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నీలం నవీన్, నీలం అలేఖ్య, ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుర్ర భాస్కర్‌తో పాటు మరికొందరు కలిసి హైదరాబాద్‌లో హత్య చేసి, మంథని సమీపంలోని గాడిదల గండిలో మృతదేహాన్ని పడవేశారని పేర్కొన్నారు.

ఇంత దారుణమైన హత్యను ముగ్గురే చేయలేరని, మరికొందరి ప్రమేయం కూడా ఉండే అవకాశముందని, నిష్పక్షపాత విచారణ జరిపి ఇందులో పాల్గొన్న వారందరినీ గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో హత్య చేసి కారులో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మృతదేహాన్ని పడవేయడం వెనుక మరికొందరి సహకారం ఉండే అవకాశం ఉందని, వారిని తప్పించే ప్రయత్నాలు జరగకుండా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.

జూల వంశీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడంతో పాటు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...