మోకు కట్టి తాటికల్లు, ఇతచెట్టు గీసి కులవృత్తిని కాపాడిన యువ గౌడ్-మడ్డి హేమసుందర్ గౌడ్
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
మోకు కట్టి తాటికల్లు, ఇతచెట్టు గీసి కులవృత్తిని కాపాడిన యువ గౌడ్-మడ్డి హేమసుందర్ గౌడ్
అంతర్గాం మండలంలోని గౌడ కులస్తులకు అతి చిన్న వయసులోనే కులవృత్తిని ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచిన- యువ గౌడ్ మడ్డి హేమంత్ గౌడ్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం బ్రాహ్మణపల్లి గ్రామంలో మడ్డి హేమాసుందర్ గౌడ్ తండ్రి మహేష్ గౌడ్ వారసత్వంగా వచ్చే కుల వృత్తికి నేను కట్టబడి ఉంటానని అతి చిన్న వయసు నుండి అంటే సుమారు 15 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి మడ్డి హేమసుందర్ గౌడ్ ఈత చెట్టు,తాటి చెట్టు ఎక్కి కులవృత్తి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మడ్డి హేమసుందర్ గౌడ్ తండ్రి మహేష్ గౌడ్ ప్రస్తుతం రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతూ మడ్డి హేమ సుందర్ గౌడ్ తాను గత సంవత్సర కాలం నుండి తన పెద్దబాబు అయినటువంటి భాస్కర్ గౌడ్ తనకి ఈత చెట్టు గీయడం, తాటి చెట్టు ఎక్కడం నేర్పించడం జరిగింది.ఈ వృత్తిని నేర్పినటువంటి మా పెద్దబాపు భాస్కర్ గౌడ్ పెద్దనాన్నను ఎప్పటికీ కూడా మర్చిపోనని యావత్ తెలంగాణలో ప్రతి గౌడ కులస్తులు పెద్దలు, చిన్నలు మన కులవృత్తిని మర్చిపోవద్దని, మన యువకులం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో కాలేజీలలో విద్యాభ్యాసం కొనసాగించి ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించిన కూడా మన తాతల, ముత్తాతల నుండి వచ్చినటువంటి కులవృత్తిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరం కూడా కులవృత్తిని నేర్చుకొని తాతల ముత్తాతల, తండ్రుల పేరు కాపాడాలని కులవృత్తిని కాపాడాలనె ఉద్దేశంతో నేను మా పెద్దబాపు మడ్డి భాస్కర్ గౌడ్ సహకారాలతో నేర్చుకొని కులవృత్తిని కొనసాగించడం జరుగుతుంది.కావున యావత్ తెలంగాణలోని యువకులు మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన కులవృత్తిని మనం నేర్చుకుని తాతలకు, తండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలని యావత్ తెలంగాణలోని యువకులకు, పెద్దవారికి నేను ఒక చిన్నవాడిగా మీకు ఒక సందేహం ఇస్తున్నట్లు మడ్డి హే మసుందర్ గౌడ్ తెలిపారు.
కామెంట్‌లు