దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోటరైజ్డ్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 20 మంది లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి, వారి స్వావలంబనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.
వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...