చనిపోయిన హోం గార్డ్‌కు నివాళులు అర్పించిన పెద్దపల్లి డీసీపీ

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

చనిపోయిన హోం గార్డ్‌కు నివాళులు అర్పించిన పెద్దపల్లి డీసీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ బి.శ్రీనివాస్ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి గోదావరిఖని శ్రీనగర్ కాలనీ (వినాయక్ నగర్)లోని ఆయన నివాసానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ... 1996 సంవత్సరంలో హోంగార్డ్‌గా ఎంపికైన బి.శ్రీనివాస్ గత 30 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో నిబద్ధతతో, నిజాయితీతో ప్రజా సేవలో అహర్నిశలు శ్రమించారని తెలిపారు.ఆయన ఆకస్మిక మరణం పోలీస్ శాఖకు, కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి తీరని లోటని పేర్కొన్నారు.ఆయన సేవలను చిరస్థాయిగా స్మరించుకుంటామని, కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, ఓర్పు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని డీసీపీ తెలిపారు. పోలీస్ శాఖ తరఫున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి,రామగుండం సీఐ కృష్ణ,హోంగార్డ్ ఆర్‌ఐ పెద్దన్న,ఎంటీవో మల్లేశం తదితర సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...