ప్రతి పౌరుడికి రూ.5 కోట్ల ఆర్థిక భరోసా కల్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన డా|| మార్షల్ దుర్గం నగేష్ సమాన ఆర్థిక హక్కులతోనే సామాజిక న్యాయం సాధ్యం
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ప్రతి పౌరుడికి రూ.5 కోట్ల ఆర్థిక భరోసా కల్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన డా|| మార్షల్ దుర్గం నగేష్
సమాన ఆర్థిక హక్కులతోనే సామాజిక న్యాయం సాధ్యం
దేశ సంపదలో ప్రతి పౌరుడికి సమాన వాటా కల్పిస్తూ రూ.5 కోట్ల ఆర్థిక భరోసా పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా|| మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్తులను ప్రజల అభ్యున్నతికి వినియోగించాలని సూచించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు భూములు, ఆస్తులు, షేర్లు, ఇతర వనరులను అందించి ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు.“దేశ సంపదను మన పూర్వీకులు నిర్మించారు. ఆ సంపదపై ప్రతి పౌరుడికీ సమాన హక్కు ఉంది. ప్రభుత్వాలు సంకల్పిస్తే ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం సాధ్యమే” అని డా|| నగేష్ పేర్కొన్నారు.అనాథలు, నిరుపేదలు, వృద్ధులకు ప్రత్యేక ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మత, సామాజిక అసమానతలను తొలగిస్తూ సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డా|| మార్షల్ దుర్గం నగేష్ విజ్ఞప్తి చేశారు.
కామెంట్‌లు