2, ఆగస్టు 2026, ఆదివారం

తబితా ఆశ్రమంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. చిన్నారులతో కేక్ కట్ చేసిన మద్దెల దినేష్

తబితా ఆశ్రమంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. చిన్నారులతో కేక్ కట్ చేసిన మద్దెల దినేష్

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు.. చిన్నారులతో కలిసి మిత్రుల దినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖులు


రామగుండం తబితా ఆశ్రమంలో చిన్నారులతో కలిసి ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్
రామగుండం, ఆగస్టు 3 (ఇది మన హక్కు): రామగుండం నియోజకవర్గంలోని తబితా ఆశ్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిత్రుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆశ్రమంలోని చిన్నారులకు కేక్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులందరూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్ పిల్లలను సొంత పిల్లల్లా చూసుకుంటూ పెంచుతున్న తీరు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు తొడుపునూరి రమేష్ కుమార్, ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు ఎం.ఏ. గౌస్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై. లెనిన్ తదితరులు పాల్గొని చిన్నారులకు ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆశ్రమంలోని చిన్నారులు పాటలు, ఆటపాటలతో సందడి చేస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి