23, జనవరి 2026, శుక్రవారం

గుండె పోటుతో మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష.....

(ఇది మన హక్కు సమాచార పత్రిక):పెద్దపల్లి జిల్లా 

గుండె పోటుతో మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష.....

ఈరోజు కాల్వశ్రీరాంపూర్ మండలం ఉషాన్నపల్లి గ్రామంలో  గుండెపోటు తో బాలే శివ ప్రసాద్ మరణించారు..అని తెలిసి పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ శ్రీమతి దాసరి ఉష గారు వారి కుటుంబ సభ్యులను కలిసి వారికీ తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.  మండలానికి వారు రిపోర్టర్ గా చేసిన సేవలు మరువలేమాని, బాలే శివ ప్రసాద్ గారు వారి భార్య పిల్లలకి తీరని కన్నీటి శోకం మిగిల్చి వెళ్ళిపోయారు. అని అన్నారు. వారు ఒక జర్నలిస్ట్ గా చేస్తూనే మాలాంటి నాయకులకు సలహాలు సూచనలు ఇచ్చేవారని గుర్తు చేసారు.. వారి కుమారులు అజయ్, అర్షిత్ తో కలిసి బాలే శివ ప్రసాద్ గారి  చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు  అర్పించిన పెద్దపల్లి జిల్లా    బీసీ జేఏసీ  చైర్మన్ దాసరి ఉష..ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్,  పెద్దపల్లి జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం  కన్వీనర్ అలువాల రాజేందర్, సాగర్, అరుణ, లక్ష్మీ , రాహుల్, అర్షిత్, అజయ్, వసంత, మల్లిశ్వరి, మణికంఠ , కుటుంబ సభ్యులు  పాల్గొనారు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి