గోదావరిఖని లో ఆకట్టుకుంటున్న వింటర్ ఉత్సవ్ మేళా-2026..”"" జన జాతరను తలపిస్తున్న ఎగ్జిబిషన్..!!,,,((ఊరు వాడ అందరి చూపు జల కన్యల వైపే...))

 ((ఇది మన హక్కు సమాచార పత్రిక.. గోదావరిఖని))


గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ్ మేళా-2026 ఎగ్జిబిషన్" సంక్రాంతి సంబరాలకు వేదికగా నిలిచింది.రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు మానసిక ప్రశాంతత కొరకు, మనోఉల్లాసం కోసం సకుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్లో సందడి చేస్తున్నారు. ఈ సారి ఏర్పాటు చేసిన ప్రదర్శన పిల్లలకు పెద్దలకు, యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిర్వాహకులు ఎండి అస్లాం  మాట్లాడుతూ,  ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతములో మొట్టమొదటి సారిగా సందర్శకులు, యువత మనసు దోచుకునే విధంగా కాశ్మీర్ అందాలు, జల కన్యల విన్యాసాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసామని ప్రజలు యువత అద్భుతమైన మధురానుభూతి పొందుతున్నారని, పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్, పెద్దలను ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులు సరదానుబూతి పొందుతున్నారని తెలిపారు. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి గృహోపకరణవస్తువులు, కళంకారి బెడ్ షీట్స్, హ్యాండి క్రాఫ్ట్, జ్యూవలరి ఐటమ్స్, హ్యాండ్ బాగ్స్ మొదలైన ఏన్నోరకాల వేరైటీలు ఇంకా కోలంబస్, జాయింట్ వీల్, క్రాస్ వీల్, బ్రెక్ డాన్స్, జంబోజేట్ మరియు చిన్న పిల్లల పార్క్ లతో ఉల్లాసంగా గడుపుతున్నారని అన్నారు. ఈ ప్రదర్శన ఇప్పుటి నుండి 60రోజుల పాటు ఉంటుందని తెలిపారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...