..రామగుండంలో ఇది మన హక్కు పత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ..."ప్రజా హక్కులపై అవగాహనకు పత్రికలే బలము: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్..

రామగుండంలో ఇది మన హక్కు పత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ..."ప్రజా హక్కులపై అవగాహనకు పత్రికలే బలము: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్..

((ఇది మన హక్కు సమాచార పత్రిక));- పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేమక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేత ఇది మన హక్కు సమాచార పత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మరియు డైరీని  ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రామగుండం నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ప్రజా హక్కులు, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో ఇది మన హక్కు వంటి పత్రికలు ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా పత్రిక నిరంతరం పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇది మన హక్కు పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు దుర్గాప్రసాద్,  పెద్దపల్లి ఓబీసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, శ్రీ చైతన్య గ్లోబల్ ఎడ్జ్ హైస్కూల్ ఏవో సందీప్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.పత్రిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తుందని, భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందాలని పలువురు ఆకాంక్షించారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...