గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యాయవాదులు–జ్యుడిషియల్ సిబ్బంది మధ్య ఉత్కంఠభరిత క్రికెట్ మ్యాచ్..
(ఇది మనహక్కు సమాచార పత్రిక):గోదావరిఖని
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యాయవాదులు–జ్యుడిషియల్ సిబ్బంది మధ్య ఉత్కంఠభరిత క్రికెట్ మ్యాచ్..
జనవరి 26 .2026
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు స్థానిక శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజ్ గ్రౌండ్ లో గోదావరిఖని న్యాయవాదులకు మరియు గోదావరిఖని జ్యుడిషియల్ ఎంప్లాయిస్ స్టాఫ్ మధ్య జరిగిన హోరాహోరీ క్రికెట్ మ్యాచ్..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డాక్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సరియైన న్యాయాన్ని అందించే వీలు ఉంటుంది అని తెలియజేశారు..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోర్టు సిబ్బంది జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యాయవాద జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 67 పరుగులు చేయగా బ్యాటింగ్ చేపట్టిన కోర్టు స్టాఫ్ జట్టు ఆరు ఓవర్లు ముగిసేలోపు విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్ లో న్యాయవాద జట్టుకు రామటెంకి శ్రీనివాస్ మరియు కోర్టు స్టాఫ్ సిబ్బంది జట్టు కెప్టెన్ గా వేణు గారు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ జీవన్ సూరజ్ సింగ్ మరియు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ వెంకట్ సచిన్ రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్ కోశాధికారి ఎండి ఉమర్ క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శోభారాణి AGP శాంతన్ కుమార్ సీనియర్ న్యాయవాదులు కొత్త కాపు సుధాకర్ రెడ్డి పెట్టం శ్రీనివాస్ చందాల శైలజ పంగ శంకర్ రామటెంకీ శ్రీనివాస్ గుర్రాల రాజేందర్ ఆసంపల్లి రవీందర్ కోర్టు సిబ్బంది జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
కామెంట్‌లు