తెలంగాణ ప్రభుత్వ పెద్దపల్లి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌గా నియమితులైన కవ్వంపల్లి సతీష్‌ను రామగుండం శాసన సభ్యులు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఘనంగా సన్మానించారు...

((ఇది మనహక్కు సమాచార పత్రిక..గోదావరిఖని))

""..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌గా నియమితులైన కవ్వంపల్లి సతీష్‌ను రామగుండం శాసన సభ్యులు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఘనంగా సన్మానించారు... 

గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కవ్వంపల్లి సతీష్‌ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సతీష్‌కు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ కవ్వంపల్లి సతీష్ గత 25 సంవత్సరాలుగా దళితుల అభ్యున్నతికి కషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూ, దళిత సంఘాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని, ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌గా నియమితులు కావడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కషి చేయాలని, ఎస్సీ, ఎస్టీల సమస్యలు ఏమైనా పరిష్కారానికి ముందుండి కషి చేయాలని, సమస్యలు ఏమున్న తమ, కలెక్టర్ దష్టికి తీసుకు రావాలని తెలిపారు. కవ్వంపల్లి సతీష్ ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, సినీ హిరో అభిమాన సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షునిగా, గురుకుల కళాశాలల పేరంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవలందిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలందించారని, కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండి, కవ్వంపల్లి సతీష్ కరోనాకు గురైనా ఆయన చేసిన సేవా కార్యక్రమాల పుణ్యమే అతన్ని బ్రతికించాయని, ప్రజలకు మంచి చేసే వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. అనంతరం కవ్వంపల్లి సతీష్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ దళిత సమస్యలపై నిరంతరం పోరాడుతూ పరిష్కారం కోసం తనవంతు కషి చేశానని, సినీ హిరో అభిమాన సంఘాల ఐక్య వేదిక ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని, రామగుండం గురుకుల పేరంట్స్ కమిటీ నాయకునిగా విద్యార్థుల సౌకర్యాల కోసం కషి చేశానని, తాను చేస్తున్న సేవలను గుర్తించి పెద్దపల్లి జిల్లా తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌గా నియమించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షకు, తాను చేస్తున్న సేవలను గుర్తించి సహకరించిన రామగుండం శాసన సభ్యులు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు, కాంగ్రెస్ తాజా మాజీ ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామికి, ఎస్సీ జిల్లా అధికారి రవీందర్‌కు, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు, సినీ హిరోల అభిమాన సంఘాల నాయకులకు, గురుకుల కళాశాలల పేరంట్స్ కమిటీ నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తాను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, సినీ హిరోల అభిమాన సంఘాల నాయకులు, గురుకుల పేరంట్స్ కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...