15, జనవరి 2026, గురువారం

రామగుండం కార్పొరేషన్ 21 డివిజన్‌లో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్‌ విజయం సాధించిన విజేతలకు క్యాష్ ప్రైజ్ అందించిన కార్పొరేటర్ అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్..

""ఇది మన హక్కు సమాచారం పత్రిక ""రామగుండం RFCL...))

రామగుండం కార్పొరేషన్ 21 డివిజన్‌లో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్‌ విజయం సాధించిన విజేతలకు క్యాష్ ప్రైజ్ అందించిన కార్పొరేటర్ అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్..

సంక్రాంతి పండుగ సందర్భంగా 21 డివిజన్‌లో కార్పొరేటర్, అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్, ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో డివిజన్‌కు చెందిన పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో రాము టీమ్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేత జట్టుకు కార్పొరేటర్ అభ్యర్థి వేల్పుల అనిల్ యాదవ్,క్యాష్ ప్రైజ్ అందజేశారు.ఈ కార్యక్రమం యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా నిర్వహించడంపై పాల్గొన్న క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.-..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి