"'..విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట- విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ శంకర్..
పెద్దపల్లి జిల్లా అంతర్గాం...
"'..విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట- విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ శంకర్..
""..పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టి టి ఎస్ అంతర్గంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం విద్యుత్ శాఖ అసిస్టెంట్ అధికారి శంకర్ మాట్లాడుతూ ఆదేశాల మేరకు ప్రతి ఊరిలో ని గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యల మీద, విద్యుత్ ద్వారా హాని కలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరిస్తూ మీ గ్రామంలో ఇప్పుడు మాకు వివరించినటువంటి మీ సమస్యలు, మిగతాఎలాంటి సమస్యలు ఉన్న మేము తక్షణమే మీ సమస్యను పరిష్కారం చేస్తామని ప్రజలకు తెలుపటం జరిగిందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ తెలిపారు. అనంతరం విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆశ శంకర్ ను గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఉషా, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి అంకం రవి, సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంగోత్ రవి కుమార్ నాయక్, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ శంకర్, సబ్ ఇంజనీర్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్ లు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు...
కామెంట్‌లు